ట్రావెల్: ఆనాటి రాచరికానికి గుర్తుగా నిలిచిన కోల్ కతా లోని రాజభవనాలు
స్వాతంత్య్రానికి ముందు బ్రిటీషర్ల పాలనలో ఉన్న ఇండియాలో అనేక రాజభవనాలు నిర్మింపబడ్డాయి. ఆనాటి రాచరికానికి గుర్తుగా ఆ రాజభవనాలు ఇప్పటికీ ఇంకా మిగిలే ఉన్నాయి. మీకు పర్యాటకం ఇష్టమైతే కోల్ కతా లోని ఈ రాజభవనాలను సందర్శించండి. అబ్బుర పరిచే సౌందర్యంతో పాటు ఆసక్తిగొలిపే చరిత్ర మీకు తెలుస్తుంది. శోభా బజార్ రాజభవనం: సుతానుతి అనే గ్రామాన్ని పాలించే మహారాజ నవక్రిష్ణ దేవ్ నిర్మించిన ఈ రాజభవనం, ఉత్తర కోల్ కతాలో ఉంది. చుట్టూ పచ్చదనంతో చూడడానికి మనోహరంగా ఉంటుంది. ఈ రాజభవనంలోని ఇటాలియన్ ఇంటీరియర్ ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తుంది. ఈ రాజభవనంలో ప్రతీ ఏడాది దుర్గాపూజ నిర్వహిస్తారు. 1757లో మొట్టమొదటి సారి దుర్గాపూజ ఇక్కడే నిర్వహించారని చెప్పుకుంటారు.
కోల్ కతా లోని మరికొన్ని రాజభవనాలు
జోర్సాంకో తకుర్బరి: నోబెల్ బహుమతి గ్రహీత రవీంద్ర నాథ్ ఠాగూర్ నివాసంగా ఉన్న ఈ భవనం, కోల్ కతాలో రబీంద్ర సరనిలో ఉంది. బ్రిటీష్ కాలంలో ఈ భవనంలో పార్టీలు, నృత్య ప్రదర్శనలు జరిగేవి. బసుబతి: కోల్ కతాలో బాగా బజార్ ప్రాంతంలో ఉన్న ఈ రాజభవనాన్ని పశుపతి బసు, నందలాల్ జమీందార్లు నిర్మించారు. ఈ భవనాన్ని 13వ శతాబ్దానికి చెందిన హోయసాలుల కళాకారుల నైపుణ్య స్ఫూర్తితో నిర్మించారు. బావలి రాజభవనం: కోల్ కతా లోని నోడాకలి ప్రాంతంలో 250సంవత్సరాల క్రితం నిర్మించిన భవనం ఇది. బెంగాల్ కి చెందిన మోండల్ కుటుంబానికి చెందింది ఈ భవనం. స్వాతంత్ర్యం తర్వాత ఈ భవనానిని ఎన్నో మార్పులు చేసి అందమైన రిసార్ట్ గా తీర్చిదిద్దారు.