
ధ్యానం గురించి అస్సలు నమ్మకూడని జనంలో ఉన్న కొన్ని అపోహాలు
ఈ వార్తాకథనం ఏంటి
యువత నుండి వృద్ధుల వరకూ అందరూ ధ్యానం చేయడాన్ని మంచి అలవాటుగా చెబుతారు. కానీ కొందరు దీనికి కొన్ని అపోహాలు జోడించారు. ధ్యానం గురించి జనంలో ఉన్న కొన్ని నమ్మకాలను ఇక్కడ బద్దలు కొడదాం.
అపోహా - ధ్యానం కూర్చుని మాత్రమే చేయాలి
చాలామంది కూర్చునే ధ్యానం చేస్తారు కానీ, ఖచ్చితంగా కూర్చునే చేయాలనే మాట నిజం కాదు. నడుస్తూ కూడా ప్రశాంతమైన ధ్యానస్థితికి చేరుకోవచ్చు. కొంతమంది సోఫాలో, బెడ్ మీద పడుకుని ధ్యానం చేస్తారు.
అపోహా - ఆలోచనలకు అడ్డు కట్ట వేసేందుకే ధ్యానం చేస్తారు
ధ్యానం చేసేటపుడు ఆహ్వానం లేకుండానే ఆలోచనలు వచ్చేస్తాయి. మీరు వాటిని కంట్రోల్ చేయాలనే ఆలోచన పెట్టుకోకుండా ఉండడమే ఉత్తమం అని గుర్తుంచుకోండి.
ధ్యానం
ధ్యానం గురించి జనాల్లో ఉన్న మరిన్ని అపోహాలు
అపోహా - ధ్యానం అంటే సమస్యల నుండి పారిపోవడం
సమస్యల నుండి పారిపోయి తాత్కాలిక ఉపశమనం పొందడానికి ధ్యానం చేస్తారని కొందరు నమ్ముతారు. నిజం చెప్పాలంటే ధ్యానం వల్ల మెదడు పనితీరు మెరుగుపడి సమస్యలను పరిష్కరించే ఆలోచనలు వస్తాయి.
అపోహా - ధ్యానం నుండి లాభాలు అంత తొందరగా రావు
కొందరికి మొదటిసారి ధ్యానం చేసినపుడే దానివల్ల లాభం కలగవచ్చు. మరికొందరికి కొంత ఆలస్యం అవుతుండవచ్చు. అంతేకానీ సంవత్సరాల తరబడి ధ్యానం చేస్తేనే లాభం ఉంటుందన్న మాట నిజం కాదు.
అపోహా- ధ్యానం చేయడం వల్ల టైమ్ వేస్ట్ అవుతుంది
ధ్యానం చేస్తే వచ్చిన ప్రశాంతత వల్ల పనులు సక్రమంగా జరుపుకునే ఆలోచన వస్తుంది. అప్పుడు టైమ్ మిగులుతుందే తప్ప వేస్ట్ అవదు.