మెదడు పనితీరును దెబ్బ తీసి మతిమరుపును తీసుకొచ్చే ఆహారాలు
మన శరీరంలో అన్నికంటికంటే ముఖ్యమైనది మన మెదడు. అందుకే మెదడుకు మంచి పోషకాలు అందించాలి. లేదంటే మెదడు పనితీరులో ఇబ్బందులు ఏర్పడి మతిమరుపు బహుమతిగా వస్తుంది. మీ మెదడు పనితీరును దెబ్బతీసే ఆహారాలు ఏంటో తెలుసుకుని వాటి నుండి వీలైనంత దూరంగా ఉండండి. ఫ్రై చేసిన ఆహారాలు: నూనెలో ఫ్రై చేసిన సమోస, చేపలు, చిప్స్, ఫ్రెంచ్ ఫ్రైస్, చికెన్ మొదలగునవన్నీ మతిమరుపు రావడానికి కారణాలుగా నిలుస్తాయి. ఒక అధ్యయనం ప్రకారం, ఫ్రై చేసిన ఆహారాలు రోజూ తినే 18,080మందిలో జ్ఞాపకశక్తి తగ్గినట్లు తెలిసింది. కూరగాయల నూనె: కూరగాయలతో తయారయ్యే నూనెలు, ఉదాహరణకు ఆవాల నూనె వల్ల ఆల్జీమర్స్ వచ్చే అవకాశం ఉందని పరిశోధనల్లో తేలింది.
మెదడు పనితీరును దెబ్బతీసే మరిన్ని ఆహారాలు
కూరగాయల నూనెలు ఒత్తిడి ఎక్కువయ్యేలా చేయగలవు. ఒత్తిడిలో మెదడు సరిగ్గా పనిచేయదు. ఛీజ్: సాచురేటెడ్ కొవ్వులు కలిగి ఉండే ఛీజ్ వల్ల మెదడుకు రక్తాన్ని తీసుకుపోయే రక్తనాళాలు మూసుకుపోయే ప్రమాదం ఉంది. దీనివల్ల బ్రెయిన్ స్ట్రోక్ వస్తుంది. అందుకే ఛీజ్ బదులు, క్రీమ్ లాగా ఉండే అవకాడో తినండి. పాదరసం అధికంగా ఉండే చేపలు: షార్క్, ట్యూనా, కింగ్, మాకెరేల్ వంటి చేపల కణజాలాల్లో మెర్క్యురీ ఎక్కువగా ఉంటుంది. ఈ పాదరసం మన శరీరంలోకి అధిక మొత్తంలో వెళితే, మెదడుకు నష్టం కలుగుతుంది. రిఫైన్ బ్రెడ్, పాస్తా: గ్లిసమిక్ ఇండెక్స్ ఎక్కువగా ఉన్న ఈ ఆహారాలను తీసుకుంటే రక్తంలో చక్కెర స్థాయిలు పెరిగి మెదడు మీద చెడు ప్రభావం పడుతుంది.