స్మార్ట్ ఫోన్ మీద ఎక్కువగా ఆధారపడుతున్నారా? మెదడు పనితీరు ఎలా దెబ్బతింటుందో తెలుసుకోండి
స్మార్ట్ ఫోన్ ఇప్పుడు మనలో ఒక అవయవంగా మారిపోయింది. దాన్ని విడిచి ఒక్క క్షణం కూడా ఉండలేకపోతున్నారు. ఏ సమాచారం కావాలన్నా స్మార్ట్ ఫోన్ మీదే ఆధారపడుతున్నారు. ఐతే స్మార్ట్ ఫోన్ ని ఎక్కువగా వాడడం వల్ల మెదడు మీద చెడు ప్రభావం ఉంటుందని సైన్స్ చెబుతోంది. ఆ చెడు ప్రభావం ఎలా ఉంటుందో ఇక్కడ తెలుసుకుందాం. ఆలోచించే సామర్థ్యం తగ్గిపోతుంది: ఏది కావాలన్నా స్మార్ట్ ఫోన్ లో వెతికేస్తున్నారు. కొంచెం కూడా ఆలోచించకుండా మెదడుకు అసలు పనే చెప్పకుండా స్మార్ట్ ఫోన్ లో వెతకడం వల్ల కొత్తగా ఆలోచించడం తగ్గిపోతుంది. ఒక వస్తువును వాడకపోతే అదెలా పాడైపోతుందో అలాగే మెదడు కూడా పాడవుతుందని అంటున్నారు. ఈ విషయం మీద పరిశోధనలు జరుగుతున్నాయి.
రాత్రి నిద్రనీ, ఉదయం మాటలను దూరం చేసే స్మార్ట్ ఫోన్
నిద్ర తగ్గిపోతుంది: రాత్రి పడుకునే ముందు స్మార్ట్ ఫోన్ వాడడం వల్ల మీకు నిద్ర సరిగ్గా పట్టదు. స్మార్ట్ ఫోన్ స్క్రీన్ లోంచి వెలువడే నీలికాంతి నిద్రకుపక్రమించే మెలటోనిన్ హర్మోన్ ని ప్రభావితం చేస్తుంది. మానసిక బద్దకాన్ని పెంచుతుంది: ఏది కావాలన్నా ఫోన్ లోనే దొరకడంతో మానసికంగా బద్దకంగా తయారవుతారు. చాలామందికి తమ ఇంట్లో వాళ్ల ఫోన్ నంబర్స్ కూడా గుర్తుండవు. స్మార్ట్ ఫోన్ మీద డిపెండ్ అవడం వల్ల అవతలి వారితో ఎలా మాట్లాడాలో తెలియకుండా పోతుంది. డిజిటల్ ప్రపంచంలోకి బయటకు రాకపోవడం వల్ల నిజ ప్రపంచంలో ఎలా ఉండాలో తెలియదు. స్మార్ట్ ఫోన్ ఎక్కువగా వాడడం వల్ల కంటికి సంబంధించిన వ్యాధులు వస్తాయి.