ఇంటికి అందాన్ని మనసుకు ఆహ్లాదాన్నిచ్చే ఈ రంగులను మీ హాల్ గోడలకు వేయండి
ఇంట్లో హాల్ ఆకర్షణీయంగా ఉండాలి. ఎందుకంటే హల్లోనే అందరూ కలుస్తారు, మాట్లాడతారు, పిల్లలు ఆడుకుంటారు. హాల్ ఆకర్షణీయంగా లేకపోతే ఇల్లు అందంగా కనిపించదు. మరి అందమైన హాల్ కోసం హాల్ గోడలకు మంచి రంగులు ఎంచుకోవాల్సి ఉంటుంది. గ్రీన్: మీ హాల్ ని అప్డేట్ చేయాలన్న ఆలోచన మీకు వస్తే, వెంటనే హాల్ గోడలకు ఆకుపచ్చ కలర్ వేయండి. ఈ రంగు పెయింట్ వల్ల ఒక తాజాదనం కలుగుతుంది. మింట్ గ్రీన్, బ్రైట్ ఎమరాల్డ్ మిడ్ గ్రీన్ బాగుంటాయి. బెయిజ్: క్రీమ్, బ్రౌన్ కలర్ మిక్స్ లో ఉండే ఈ పెయింట్ ని మీ హాల్ గోడలకు వేసుకుంటే సరికొత్త లుక్ వస్తుంది. ఈ రంగు గోడల్లో విద్యుద్దీపాల వెలుతురు ఎక్కువగా ఉంటుంది.
ఇంటి హాల్ గోడలను ఆకర్షణీయంగా మార్చే మరిన్ని రంగులు
బెయిజ్ రంగులకు అపోజిట్ కలర్ లో హాల్ ఇంటిరీయర్ ఉంటే చూడడానికి ఆకర్షణీయంగా ఉంటుంది. గ్రే: మీ ఇంటి హాల్ కి పాతకాలపు అందాన్ని తీసుకురావాలన్నా లేదా అధునాతన అందాన్ని తీసుకురావాలన్నా ఈ గ్రే కలర్ సరిగ్గా సరిపోతుంది. గోడలు గ్రే కలర్ లో ఉన్నప్పుడు హాల్ లో వేలాడే వస్తువులు బాగా అందంగా కనిపిస్తాయి. డార్క్ గ్రే, పేల్ సిల్వర్ రంగులు బాగుంటాయి. నీలం: బ్లూ కలర్ గోడలు ఇంటిని చాలా ప్రశాంతంగా మార్చేస్తాయి. తెలియకుండానే మీలో మంచి నిశ్శబ్దం వస్తుంది. ఐసీ బ్లూ కలర్ బాగుంటుంది. నలుపు: మీ ఇంటి గోడలకు సరికొత్త డ్రామాను తీసుకొస్తుంది నలుపు రంగు. మీ ఇంటి నిర్మాణాన్ని నలుపు రంగు మరింత బయటకి తీసుకొస్తుంది.