ట్రావెల్: కెన్యా పర్యటనకు వెళ్ళినపుడు గుర్తుగా తీసుకురావాల్సిన వస్తువులు
ఈ వార్తాకథనం ఏంటి
తూర్పు ఆఫ్రికా దేశమైన కెన్యాలో అటవీ ప్రాంతం ఎక్కువగా ఉంటుంది. అడవి జంతువులను చూడాలనుకునే వారు కెన్యాలో మంచి సఫారీ అనుభావాన్ని పొందుతారు.
జంతువుల సందర్శన మాత్రమే కాకుండా కెన్యాలో చూడాల్సిన ప్రదేశాలు చాలానే ఉన్నాయి. అయితే కెన్యా దేశ ప్రజల సంస్కృతి ఆసక్తిగా ఉంటుంది. ఆ సంస్కృతిని కెన్యా పర్యటన గుర్తుగా తెచ్చుకోవాలంటే ఎలాంటి వస్తువులు కొనాలో తెలుసుకుందాం.
కాఫీ:
తూర్పు ఆఫ్రికా దేశాల్లో కాఫీని అత్యధికంగా పండించే దేశం కెన్యా. ఇక్కడ కాఫీ చాలా స్ట్రాంగ్ గా ఉంటుంది. పండ్లు, వైన్ రుచుల్లో కాఫీ లభిస్తుంది. మార్కెట్ లలో కాఫీ గింజలు ఈజీగా దొరుకుతాయి. లేదా స్థానిక కాఫీ తోటలకు వెళ్ళవచ్చు.
Details
కెన్యా నుండి తెచ్చుకోవాల్సిన జ్ఞాపకాలు
మాసై బీడ్స్:
చిన్న చిన్న పూసలతో తయారయ్యే ఆభరణాలు కెన్యా సంస్కృతిలో ఒక భాగం. చాలామంది కెన్యా దేశస్తులు ఈ పూసలు ధరిస్తూ కనబడతారు. ఈ పూసల్లో చాలా రంగులు ఉంటాయి. ఒక్కో రంగుకు ఒక్కో ప్రాముఖ్యత ఉంటుందని నమ్ముతారు.
కికోయ్స్, ఖంగాస్:
మగవాళ్ళకు కికోయ్స్, ఆడవాళ్ళకు ఖంగాస్ అనే కాటన్ వస్త్రాలు కెన్యాలో చాలా ఫేమస్. ఆడవాళ్ళు, తమ పిల్లలను ఎత్తుకోవడానికి ఖంగాస్ వస్త్రాలు వాడతారు. అలాగే ప్రత్యేకంగా బీచ్ ప్రదేశాలకు వెళ్ళినపుడు ఉపయోగిస్తారు.
సోప్ స్టోన్ వస్తువులు:
కెన్యాలో దీన్ని కిస్సీ స్టోన్ అంటారు. ఈ రాయితో చిన్న చిన్న జంతువుల బొమ్మలు తయారు చేస్తారు. చూడటానికి చాలా అందంగా ఉంటాయి.