జుట్టు పొడిబారుతోందా, అయితే ఈ హోంమేడ్ హెయిర్ మాస్కులను ప్రయత్నించండి
జుట్టు పొడిబారడం, బలహీనంగా మారడం, రాలిపోవడం, జుట్టు కుదుళ్లు బలంగా లేకపోవడం వంటి అంశాలు అందరినీ చికాకు పెట్టే అంశాలే.మరికొందరిని అయితే కలవరపెట్టే అంశంగా నిలుస్తాయి. జట్టు బలంగా లేకపోతే ప్రతి ఒక్కరూ ఆందోళనకు గురవుతారు. ప్రస్తుతం ఇదో సాధారణ సమస్యగా మారిపోయింది. పురుషులతో పాటు, మహిళలకూ జుట్టు పొడిబారడం, రాలిపోవడం లాంటి సమస్యలు వేధిస్తున్నాయి. ఇందుకు అనేక కారణాలున్నాయి. అయితే వంటింటి ప్రక్రియతో జుట్టు పెరగడానికి చిట్కాలు పొందొచ్చు.హోంమేడ్ హెయిర్ మాస్క్ ఎలా తయారు చేయాలో తెలుసుకుందామా. 1. అలొవెరా మాస్క్ జెల్ రెండు టీస్పూన్ల తాజా అలోవెరా జెల్‌ను 1 టీస్పూన్ తేనె మరియు 2 టీస్పూన్ల కొబ్బరి నూనెతో కలపండి. మసాజ్ చేసి తలకు,వెంట్రుకలకు అప్లై చేయాలి.
ఆయా జెల్ మాస్కులతో మీ జుట్టు పదిలం
2. హైబిస్కస్ మాస్క్ జెల్ 15 మందార ఆకులు, 3 పువ్వులు తీసుకోండి.వాటిని కడగి పువ్వుల నుంచి రేకులను వేరు చేసి నీటితో గ్రైండర్‌లో రుబ్బాలి. తర్వాత మెత్తని పేస్ట్‌ను జుట్టుకు పట్టించి 30 నిమిషాలు ఉంచి షాంపూతో కడగాలి 3. ఎగ్ వైట్ మాస్క్ ఓ చిన్న గిన్నెలో 2 గుడ్ల తెల్లసొనను వేసి 2 టేబుల్ స్పూన్ల కొబ్బరి నూనె వేసి కలపాలి.దీన్ని తడి జుట్టు కుదుళ్లకి బాగా పట్టించాలి. తర్వాత 20 నిమిషాలు అలా వదిలేసి అనంతరం చల్లని నీటితో స్నానం చేయండి. 4. మింట్ హెయిర్ మాస్క్ పుదీనా ఆకులు పేస్ట్ లేదా పుదీనా నూనెకు కొద్దిగా కొబ్బరి నూనె మిక్స్ చేసి తలకు పట్టించాలి.
జుట్టు ఆరోగ్యానికి హెయిర్ మాస్కులు చక్కటి పరిష్కారం
ఈ మిశ్రమం మీ జుట్టు ఆరోగ్యాన్ని మెరుగుపరచి, జుట్టు బలంగా పెరిగేందుకు సహకరిస్తుంది. 5. పెరుగు, నిమ్మ మాస్క్ ఈ హెయిర్ మాస్క్ చేసేందుకు, 2 గుడ్లు, పెరుగుే- 4 tsp, నిమ్మకాయ రసం, ఆముదం - 2 tsp అవసరం. 6. కొబ్బరి పాలు, ఆలివ్ ఆయి గిన్నెలో కొబ్బరి పాలు, తేనె, ఆలివ్ నూనె వేసి బాగా కలపి పట్టించాలి. అరగంట వదిలేయాలి.తర్వాత తేలికపాటి షాంపూతో తలస్నానం చేయాలి. 7. అరటిపండు, తేనె మాస్క్ అరటి పండ్లు, బొప్పాయిని చిన్న ముక్కలుగా చేసి ఆ మిశ్రమానికి కాస్త తేనె కలిపి పేస్టులా చేయాలి. ఈ మిశ్రమాన్ని జుట్టు మొదళ్ల వరకు పట్టించి అరగంట అనంతరం స్నానం చేసుకోవాలి.