Study Skills: చదువులు సులభంగా గుర్తుండేలా చేసే 7 సరికొత్త పద్ధతులు.. ట్రై చేయండిలా!
చదివినా చదువులు గుర్తుండట్లేదా? పరీక్షలు బాగా రాసినా స్కోరు ఆశించినంతగా రాలేదా? ఈ సమస్యను ఎదుర్కొంటున్న వారిలో మీరూ ఉన్నారా? అయితే, మీ చదవు పద్ధతుల్లో కొన్ని మార్పులు చేసుకోవాల్సిన సమయం వచ్చిందని నిపుణులు సూచిస్తున్నారు. కొన్ని సాధారణ టెక్నిక్స్‌ని అలవాటు చేసుకుంటే, మీరు అంచనాలకు మించి మంచి ఫలితాలు సాధించవచ్చు. ఇక్కడ ఆ టెక్నిక్స్ ఏమిటో తెలుసుకుందాం. 1. మైండ్ మ్యాపింగ్ మైండ్ మ్యాపింగ్ టెక్నిక్ మీరు చదివే పాఠ్యాంశాల మధ్య సంబంధాలను సులభంగా అర్థం చేసుకోవడంలో సాయపడుతంది. పాఠంలోని ముఖ్య అంశాలను విజువల్ ఫార్మాట్‌లో (రేఖాచిత్రాల రూపంలో) పరిగణించడం ఈ టెక్నిక్ మూలమైనది. దీని వల్ల అవగాహన ఎక్కువ కాలం గుర్తుండేలా ఉంటుంది.
కలర్ కోడెడ్ నోట్స్
వివిధ రంగులు ఉపయోగించడం ద్వారా నోట్స్ రాయడం విజువల్ లెర్నర్స్‌కి చాలా ఉపయోగకరమైన పద్ధతి. ముఖ్యమైన కాన్సెప్టులను రంగులతో హైలైట్ చేయడం, చదవు ప్రక్రియను మరింత ఆకర్షణీయంగా చేస్తుంది. 3. గ్రూప్ స్టడీ గ్రూప్ స్టడీ సెషన్‌లు విద్యార్థుల మధ్య పరస్పర సహకారాన్ని పెంచడంతో పాటు అర్థంకాని విషయాలను చర్చించడం ద్వారా సమర్థవంతమైన లెర్నింగ్ సాధ్యం అవుతుంది. ఇది అధ్యయనంలో గణనీయమైన పురోగతి చూపిస్తుంది.
4. ఎడ్యుకేషనల్ వీడియోలు, డాక్యుమెంటరీలు
వీడియోలు, డాక్యుమెంటరీలు సబ్జెక్టుపై మీ అవగాహనను పెంచడంతో పాటు సాంప్రదాయ చదవు పద్ధతుల నుంచి విరామం కలిగిస్తాయి. మీకు తెలియని విషయాలు సులభంగా నేర్చుకోవచ్చు. 5. ఫెయిన్మన్ లెర్నింగ్ టెక్నిక్ ఫెయిన్మన్ టెక్నిక్ ద్వారా మీరు నేర్చుకున్న విషయాలను సరళంగా ఇతరులకు అర్థమయ్యేలా చెప్పడం సాధనంగా ఉంటుంది. మీరు పూర్తిగా అర్థం చేసుకున్న విషయాలు మాత్రమే క్లియర్‌గా చెప్పగలుగుతారు. దీన్నో అలవాటు చేసుకుంటే మీ అవగాహన లోపాలను గుర్తించడమే కాకుండా, కొత్త విషయాలను నేర్చుకోవడం సులభమవుతుంది. 6. నోట్-టేకింగ్ సమాచారాన్ని సంగ్రహించి, ఆర్గనైజ్ చేసుకోవడం కోసం నోట్-టేకింగ్ పద్ధతిని అలవరుచుకోవాలి. అవసరమైన సమాచారం కేవలం ముఖ్యమైన విషయాలనే సులభంగా గుర్తుంచుకోవడానికి ఇది తోడ్పడుతుంది.