
18,500బార్బీ బొమ్మలతో గిన్నిస్ రికార్డ్: బార్బీ డాక్టర్ గా పేరు తెచ్చుకున్న బెట్టినా డార్ఫ్ మ్యాన్
ఈ వార్తాకథనం ఏంటి
బార్బీ సినిమా రిలీజైనప్పటి నుండి బార్బీ బొమ్మలను అభిమానించే వారి గురించి వార్తలు వస్తూనే ఉన్నాయి.
తాజాగా 18,500 బార్బీ బొమ్మలను కలెక్ట్ చేసిన బార్బీ డాక్టర్ బెట్టినా డార్ఫ్ మ్యాన్ గురించి సోషల్ మీడియాలో మాట్లాడుకుంటున్నారు.
ఎక్కువ బార్బీ బొమ్మలు కలిగిన వ్యక్తిగా గిన్నిస్ రికార్డు అందుకున్న బెట్టినా, బార్బీ బొమ్మలకు రిపేర్లు చేస్తూ బార్బీ డాక్టర్ గా పేరు తెచ్చుకుంది.
బార్బీ బొమ్మలను 1959లో మ్యాటెల్ కనిపెట్టారు. ఆ తర్వాత ఆ బొమ్మలు ప్రపంచవ్యాప్తంగా పాపులర్ అయ్యాయి.
62ఏళ్ల బెట్టినా, తన మొదటి బార్బీ బొమ్మను ఐదేళ్ళ వయసులో తల్లిదండ్రుల దగ్గర నుండి అందుకుంది. అయితే 1993నుండి బార్బీ బొమ్మలను కలెక్ట్ చేయడం బెట్టినా స్టార్ట్ చేసింది.
Details
2005నుండి గిన్నిస్ రికార్డు
చిన్నప్పటి నుండి తనకు బార్బీ బొమ్మలంటే ఇష్టమని, వాటిని చాలా ఇష్టంగా చూసుకుంటాననీ గిన్నిస్ వరల్డ్స్ రికార్డ్స్ వారికి బెట్టినా తెలియజేసింది.
అత్యధిక బార్బీ బొమ్మలు కలిగిన వ్యక్తిగా 2005నుండి బెట్టినా పేరు మీదే రికార్డు ఉంది.
బార్బీ బొమ్మలను కలెక్ట్ చేసే బెట్టినా, పాడైపోయిన బొమ్మలకు రిపేర్లు చేసేది. అది చూసిన చుట్టుపక్కల వాళ్ళు తమ బొమ్మలను రిపేర్ చేయించుకునేవారు.
బార్బీ రిపేర్లలో క్షణాల్లో రిపేర్ పూరయ్యే వాటికి 450రూపాయలు, రిపేర్ చేయడానికి ఎక్కువ సమయం పడితే 27వేల వరకు తీసుకుంటుంది.
అంతేకాదు, బార్బీ మీద పుస్తకాలు కూడా రాస్తుంది బెట్టినా.