Loading...
Endu Royyala Pachadi: సరికొత్త రుచి… ఎండు రొయ్యల పచ్చడి ఒక్కసారి తింటే మళ్లీ మళ్లీ కావాలంటారు!
సరికొత్త రుచి… ఎండు రొయ్యల పచ్చడి ఒక్కసారి తింటే మళ్లీ మళ్లీ కావాలంటారు!

Endu Royyala Pachadi: సరికొత్త రుచి… ఎండు రొయ్యల పచ్చడి ఒక్కసారి తింటే మళ్లీ మళ్లీ కావాలంటారు!

వ్రాసిన వారు Jayachandra Akuri
Mar 02, 2026
02:34 pm

ఈ వార్తాకథనం ఏంటి

ఎండు రొయ్యలతో సాధారణంగా కర్రీ లేదా ఫ్రై చేసుకుంటాం. కొన్నిసార్లు టమోటా, వంకాయ, గోంగూర వంటి కూరగాయలతో కలిపి కాంబినేషన్ వంటకాలు తయారు చేస్తారు. అయితే ఈసారి కొంచెం భిన్నంగా, రుచికరంగా ఉండే 'ఎండు రొయ్యల పచ్చడి'ని తయారు చేద్దాం. చికెన్, మటన్ తిని బోర్ కొట్టినవారికి ఇది కొత్త రుచిని అందిస్తుంది. ఇంట్లో పెద్దలతో పాటు పిల్లలు కూడా ఇష్టంగా తినేలా ఉంటుంది. పైగా తక్కువ సమయంలోనే రెడీ చేసుకోవచ్చు. ఇప్పుడు ఈ పచ్చడి తయారీకి కావాల్సిన పదార్థాలు, విధానం తెలుసుకుందాం.

Details

కావాల్సిన పదార్థాలు

ఎండు రొయ్యలు - ఒక కప్పు

నూనె - 6 టేబుల్ స్పూన్లు

ఉల్లిపాయలు - 2

అల్లం ముక్కలు - 1 టీ స్పూన్

వెల్లుల్లి రెబ్బలు - 1 టీ స్పూన్

కరివేపాకు - కొద్దిగా

ఎండుమిర్చి - 6

చింతపండు - కొద్దిగా

పచ్చికొబ్బరి తురుము - ఒక కప్పు

కొత్తిమీర - కొంచెం

ఉప్పు - రుచికి సరిపడా

మామిడికాయ - 1

Details

తయారీ విధానం

1.ముందుగా ఎండు రొయ్యలను తీసుకుని వాటి తల, తోక భాగాలను తొలగించి శుభ్రంగా కడగాలి.

2.పచ్చికొబ్బరి తురుము, ఉల్లిపాయలు, మామిడికాయను ముక్కలుగా తరిగి సిద్ధంగా ఉంచాలి.

3.స్టవ్‌పై పాన్ పెట్టి రెండు టేబుల్ స్పూన్ల నూనె పోసి వేడి చేయాలి. నూనె వేడైన తర్వాత ఎండు రొయ్యలు వేసి బాగా వేయించాలి. అవి వేగిన తర్వాత ప్లేట్‌లోకి తీసి పెట్టాలి.

4.అదే పాన్‌లో మరో రెండు టేబుల్ స్పూన్ల నూనె వేసి వేడి చేయాలి. అందులో తరిగిన ఉల్లిపాయ ముక్కలు వేసి వేయించాలి. ఉల్లిపాయలు వేగిన తర్వాత అల్లం, వెల్లుల్లి, కరివేపాకు వేసి ఫ్రై చేయాలి.

5.తరువాత ఎండుమిర్చి, చింతపండు వేసి మంటను లో ఫ్లేమ్‌లో ఉంచి కొద్దిసేపు వేగనివ్వాలి.

ADVERTISEMENT

Details

తయారీ విధానం1/2

6.ఇప్పుడు పచ్చికొబ్బరి తురుము, కొత్తిమీర, ఉప్పు వేసి మరోసారి కలిపి వేయించాలి. స్టవ్ ఆఫ్ చేసి మూతపెట్టి కొద్దిసేపు మగ్గనివ్వాలి.

7.అనంతరం మిక్సీ జార్‌లో వేయించిన రొయ్యలు, మామిడికాయ ముక్కలు, ఫ్రై చేసిన ఉల్లిపాయ-మిర్చి మిశ్రమం వేసి కాస్త కచ్చాపచ్చాగా గ్రైండ్ చేయాలి.

8.మరోసారి పాన్‌లో రెండు టేబుల్ స్పూన్ల నూనె వేడి చేసి కొద్దిగా కొత్తిమీర వేసి స్టవ్ ఆఫ్ చేయాలి. అందులో గ్రైండ్ చేసిన పచ్చడి వేసి బాగా కలపాలి.

ఇంతే, ఘుమఘుమలాడే ఎండు రొయ్యల పచ్చడి సిద్ధం! వేడివేడి అన్నంలో ఈ పచ్చడి వేసుకుని తింటే మరొక రెండు ముద్దలు అదనంగా తినాల్సిందే.

ఈ పచ్చడిని గ్లాస్ జార్‌లో నిల్వ చేసి ఫ్రిజ్‌లో పెడితే మూడ్రోజుల వరకు ఉంటుంది.

ADVERTISEMENT