Page Loader
Sri Ramanavami Recipes: శ్రీరామ నవమికి శక్తివంతమైన నైవేద్యం.. పానకం పూరీ రుచిని ఆస్వాదించండి! 
శ్రీరామ నవమికి శక్తివంతమైన నైవేద్యం.. పానకం పూరీ రుచిని ఆస్వాదించండి!

Sri Ramanavami Recipes: శ్రీరామ నవమికి శక్తివంతమైన నైవేద్యం.. పానకం పూరీ రుచిని ఆస్వాదించండి! 

వ్రాసిన వారు Jayachandra Akuri
Apr 03, 2025
05:30 pm

ఈ వార్తాకథనం ఏంటి

పండగల ప్రత్యేకతను మరింత హైలైట్ చేస్తూ, మన జ్ఞాపకాల్ని తట్టి లేపే వంటకాలలో 'పానకం పూరి' ఒకటి. వేసవికాలంలో మామిడి పండ్లు సులభంగా దొరికే ఈ సీజన్‌లో, వాటితో పానకం తయారు చేసి, వేడి వేడి పూరీలతో ఆరగిస్తే ఆ రుచి అమోఘం. ప్రత్యేకించి పండగల సమయంలో ఉపవాసం ఉండే వారు ఈ పానకం పూరిని తీసుకుంటే, దాని పోషక విలువలు శక్తిని అందిస్తాయి. రసాలూరే మామిడిపండ్లతో రుచికరమైన పానకం తాగితే ఒంట్లోని ఆత్మారాముడు సంతోషపడతాడు. ఫెస్టివల్ స్పెషల్ అయిన ఈ వంటకాన్ని ఎలా తయారుచేసుకోవాలో చూద్దాం!

Details

 పానకం తయారీకి కావాల్సిన పదార్థాలు 

3 పండిన మామిడి పండ్లు (ఏ రకమైనా) మామిడిపండు తీపి తక్కువగా ఉంటే 1 టేబుల్ స్పూన్ చక్కెర ¼ కప్పు పాలు ¼ టీస్పూన్ ఏలకుల పొడి కుంకుమ పువ్వు (ఐచ్ఛికం) ¼ టీస్పూన్ అల్లం లేదా శొంటి పొడి (ఐచ్ఛికం)

Details

పూరి తయారీకి కావాల్సినవి 

2 కప్పులు గోధుమ పిండి ¼ టీస్పూన్ ఉప్పు పిండిముద్ద చేయడానికి సరిపడేంత నీరు డీప్ ఫ్రై చేయడానికి సరిపడేంత నూనె పూరీ తయారీ విధానం 1. గోధుమ పిండి, ఉప్పును ఒక గిన్నెలో వేసి, తగినన్ని నీళ్లు కలిపి మృదువైన పిండిముద్ద చేయాలి. 2. ముద్దను చిన్నచిన్న ముద్దలుగా తీసుకుని, అవసరమైన పరిమాణంలో ఒత్తుకోవాలి. 3. స్టవ్ మీద నూనె వేడెక్కిన తర్వాత, ఒక్కొక్కటి నూనెలో వేసి బంగారు రంగు వచ్చే వరకు డీప్ ఫ్రై చేయాలి.

Details

పానకం తయారీ విధానం 

1. మామిడి పండ్లను శుభ్రంగా కడిగి, తొక్క తీసి ముక్కలుగా కోయాలి. 2. టెంక తీసివేసి, ముక్కలను మిక్సీలో వేసుకోవాలి. 3. పైన చెప్పిన ఇతర పదార్థాలను కూడా జోడించి, బాగా బ్లెండ్ చేయాలి. 4. చిక్కగా వచ్చిన ఈ జ్యూస్‌ను గిన్నెల్లోకి తీసుకుని సర్వ్ చేయాలి. ఈ పానకాన్ని వేడి వేడి పూరీలతో ఆరగిస్తే, అద్భుతమైన రుచిని ఆస్వాదించొచ్చు. పండగ రోజుల్లో ఇది ప్రత్యేకమైన వంటకం. శరీరాన్ని చల్లగా ఉంచడంతో పాటు, రుచికరమైన అనుభూతిని అందించే ఈ పానకం పూరీని మీరు కూడా ట్రై చేయండి!