mAadhaar APP: ఐదుగురు కుటుంబ సభ్యుల ఆధార్ ప్రొఫైల్‌లు ఒకే చోట!
యునిక్ ఐడెంటిఫికేషన్ అథారిటీ ఆఫ్ ఇండియా (UIDAI) రూపొందించిన mAadhaar యాప్, మీ ఆధార్ సమాచారాన్ని డిజిటల్‌గా నిర్వహించేందుకు అత్యంత సులభమైన మొబైల్ యాప్‌గా ఉపయోగపడనుంది. ఇందులో eAadhaarని డౌన్‌లోడ్ చేయడం, ప్రొఫైల్‌ను అప్‌డేట్ చేయడం, బయోమెట్రిక్ డేటాను లాక్ లేదా అన్‌లాక్ చేయడం వంటి అనేక ఫీచర్లు ఉన్నాయి. ఆసక్తికరంగా ఈ యాప్‌తో ఒకే చోట ఐదు వేర్వేరు ఆధార్ ప్రొఫైల్‌లను సృష్టించడానికి వీలు కలుగనుంది. మీ ఫోన్‌లో ప్లే స్టోర్ లేదా యాప్ స్టోర్ నుంచి mAadhaar యాప్‌ను డౌన్‌లోడ్ చేసి ఇన్‌స్టాల్ చేయండి. యాప్‌ను తెరిచి, మీ ఆధార్ నంబర్ లేదా వర్చువల్ ID (VID) ఉపయోగించి లాగిన్ కావాలి.
mAadhaar యాప్‌ని ఎలా ఉపయోగించాలి
ధృవీకరణ కోసం మీ రిజిస్టర్డ్ మొబైల్ నంబర్‌కు వన్-టైమ్ పాస్‌వర్డ్ వస్తుంది. ఓటీపీ ఎంటర్ చేయగానే మీ ఆధార్ వివరాలు యాప్ డ్యాష్‌బోర్డ్‌లో కనపడతాయి. మీరు లాగిన్ అయిన తర్వాత, గరిష్టంగా నాలుగు కుటుంబ సభ్యుల ప్రొఫైల్‌లను జోడించవచ్చు. "ప్రొఫైల్ విభాగం"లో "ప్రొఫైల్‌ను జోడించు"పై నొక్కండి, వారి ఆధార్ నంబర్‌ను నమోదు చేయండి లేదా QR కోడ్‌ను స్కాన్ చేయండి. వారి ఆధార్‌తో లింక్ చేసిన మొబైల్ నంబర్‌కు OTP వస్తుంది. OTPని నమోదు చేసిన తర్వాత, వారి ప్రొఫైల్ మీ mAadhaar యాప్‌లో పాపప్ అవుతుంది.
సమాచారం మరింత భద్రత
ప్రొఫైల్ విభాగానికి వెళ్లి మీకు కావలసినదాన్ని ఎంచుకోండి. మీరు వారి ఆధార్ కార్డ్ యొక్క డిజిటల్ కాపీని పొందచ్చు. చిరునామా లేదా ఇతర వివరాలను అప్‌డేట్ చేయవచ్చు. బయోమెట్రిక్‌లను లాక్ లేదా అన్‌లాక్ చేయవచ్చు. వారి ఆధార్ QR కోడ్‌ను తక్షణం షేర్ చేయవచ్చు. mAadhaar యాప్‌తో మీ సమాచారాన్ని సురక్షితంగా భద్రపరచవచ్చు.