LOADING...
ABC Juice: ఆరోగ్యానికి 'ABC' జ్యూస్‌.. ఎవరు తాగొచ్చు? ఎలా తయారు చేయాలి?
ఆరోగ్యానికి 'ABC' జ్యూస్‌.. ఎవరు తాగొచ్చు? ఎలా తయారు చేయాలి?

ABC Juice: ఆరోగ్యానికి 'ABC' జ్యూస్‌.. ఎవరు తాగొచ్చు? ఎలా తయారు చేయాలి?

వ్రాసిన వారు Jayachandra Akuri
Dec 22, 2025
01:17 pm

ఈ వార్తాకథనం ఏంటి

ఏ, బీ, సీ... ఇవేవో ఆంగ్ల అక్షరాలే కాదు. ఇవి నిజానికి ఆరోగ్యానికి నిధులు, పోషకాల నిక్షేపాలు. ఆపిల్ (Apple), బీట్‌రూట్ (Beetroot), క్యారెట్ (Carrot) — ఈ మూడు పండ్లు-కూరగాయలతో తయారయ్యే ABC జ్యూస్ శరీరానికి ఎంతో మేలు చేస్తుందని నిపుణులు చెబుతున్నారు. ఈ మూడింటిని మిక్సీలో వేసి జ్యూస్‌గా తయారు చేసి, కొద్దిగా నిమ్మరసం లేదా అల్లం కలిపితే రుచి కూడా బాగుండి, శరీరానికి త్వరగా పట్టేస్తుందని సూచిస్తున్నారు. మరి ఈ పానీయం వల్ల కలిగే ప్రయోజనాలు ఏమిటి? ఎలా తయారు చేసుకోవాలి? ఇప్పుడు తెలుసుకుందాం.

Details

చక్కెర స్థాయిలు అదుపులో

'రోజుకు ఒక ఆపిల్ తింటే డాక్టర్ అవసరం ఉండదు' అనే మాట వెనుక కారణం లేకపోలేదు. ఆపిల్‌లో ఫైబర్, విటమిన్లు, యాంటీ ఆక్సిడెంట్లు సమృద్ధిగా ఉంటాయని నిపుణులు చెబుతున్నారు. వీటిని క్రమం తప్పకుండా తీసుకుంటే జీర్ణక్రియ మెరుగుపడటంతో పాటు అధిక బరువు నియంత్రణలోకి వస్తుందని తెలిపారు. శరీరంలోని కొవ్వు శాతం తగ్గడానికీ ఇది సహకరిస్తుందంటున్నారు. ఆపిల్‌లోని విటమిన్ సి చర్మానికి మెరుపునిస్తుందని, మలబద్ధకం సమస్యను తగ్గిస్తుందని వివరించారు. అంతేకాకుండా, రక్తంలో చక్కెర స్థాయిలను నియంత్రించడంలో కీలక పాత్ర పోషిస్తుందని పేర్కొన్నారు. ఇవి శక్తిని అందించడమే కాకుండా శరీర వృద్ధి, ఎముకల ఆరోగ్యం, రోగనిరోధక వ్యవస్థ పనితీరు వంటి అనేక ముఖ్యమైన శారీరక ప్రక్రియల్లో భాగస్వాములవుతాయని National Library of Medicine అధ్యయనం వెల్లడించింది.

Details

dg

గుండె జబ్బులు, కొన్ని రకాల క్యాన్సర్లు, టైప్-2 డయాబెటిస్ వంటి దీర్ఘకాలిక వ్యాధులు ఉన్నవారు కూడా వైద్యుల సూచన మేరకు ఈ జ్యూస్ తీసుకోవచ్చని నిపుణులు సూచిస్తున్నారు. ఆపిల్, బీట్‌రూట్, క్యారెట్ — ఈ మూడింటి మిశ్రమమే ABC జ్యూస్. దీన్ని రోజూ తాగాల్సిన అవసరం లేదు. వారానికి ఒకటి లేదా రెండు సార్లు తీసుకుంటే సరిపోతుంది. ఇందులో విటమిన్ A, C, K, B9, పొటాషియం, ఐరన్, యాంటీ ఆక్సిడెంట్లు, ఫైబర్లు, నైట్రేట్లు పుష్కలంగా ఉంటాయి. అన్ని వయసుల వారికి ఉపయోగకరం. దీర్ఘకాలిక వ్యాధులు ఉన్నవారు వైద్యుల సలహా మేరకు తీసుకోవాలి.

Advertisement

Details

దాని రూటే వేరు

ఆరోగ్యానికి, అందానికి చిరునామాగా చెప్పుకునే దుంపల్లో బీట్‌రూట్ ముందువరుసలో ఉంటుంది. దీనిని పచ్చిగా, కూరల్లోనే కాకుండా జ్యూస్‌లు, స్మూతీలు, సూప్‌ల రూపంలో కూడా చాలామంది తీసుకుంటారు. బీట్‌రూట్ రక్తంతో సంబంధం ఉన్న అవయవాల పనితీరును మెరుగుపరుస్తుందని నిపుణులు చెబుతున్నారు. ముఖ్యంగా రక్తహీనతను తగ్గించడంతో పాటు గుండె ఆరోగ్యాన్ని మెరుగుపరుస్తుందని పేర్కొన్నారు. బీట్‌రూట్ రక్తపోటును నియంత్రించడంలో సహాయపడుతుందని National Library of Medicine అధ్యయనం వెల్లడించింది. ఇందులో విటమిన్ సి, ఐరన్, పొటాషియం, ఫైబర్లు, నైట్రేట్లు పుష్కలంగా ఉండటంతో రోగనిరోధక శక్తి పెరిగి, శరీరం ఎప్పుడూ ఉత్సాహంగా ఉంటుందని వివరించారు.

Advertisement

Details

కంటికి మేలు

క్యారెట్ పోషకాల గనిగా చెప్పుకోవచ్చు. ఇది కంటిచూపును మెరుగుపరచడంతో పాటు రోగనిరోధక శక్తిని పెంచుతుందని నిపుణులు చెబుతున్నారు. ఇందులో ఉన్న బీటా-కెరోటిన్ కంటి సంబంధిత వ్యాధులను దూరం చేస్తుందని తెలిపారు. క్యారెట్‌ను క్రమం తప్పకుండా తీసుకుంటే జీర్ణక్రియ సక్రమంగా సాగుతుందని, ఇందులోని యాంటీ ఆక్సిడెంట్లు చర్మ కణాలను ఆరోగ్యంగా ఉంచుతాయని వివరించారు.

Details

పంచదార అవసరం లేదు 

ABC జ్యూస్‌లో ఆపిల్ ప్రధాన పాత్ర పోషిస్తుంది. ఇది సహజంగానే తియ్యదనాన్ని అందిస్తుందని నిపుణులు చెబుతున్నారు. బీట్‌రూట్ జ్యూస్‌కు ఆకర్షణీయమైన రంగును ఇస్తే, క్యారెట్ పోషక విలువలను మరింత పెంచుతుందంటున్నారు. ఈ జ్యూస్ తయారీకి ఆపిల్, బీట్‌రూట్, క్యారెట్‌లను చిన్న ముక్కలుగా కట్ చేసి మిక్సీలో వేసి జ్యూస్ చేయాలి. పంచదార వేసే అవసరం లేదని, తియ్యదనం కావాలనుకునే వారు మాత్రమే కొద్దిగా వేసుకుంటే సరిపోతుందని సూచిస్తున్నారు.

Advertisement