
Motivational : తెలివైన మహిళలు ఎవరు? చాణక్యుడు చెప్పిన లక్షణాలు ఇవే!
ఈ వార్తాకథనం ఏంటి
ఎవరైనా సరే మంచి భార్య, సున్నితమైన మనసు, తెలివి గల అమ్మాయి తన ఇంటికి కోడలిగా రావాలని కోరుకుంటారు. కొందరు ఒక మంచి మనసున్న భార్య కావాలని కోరుకుంటారు. కొందరు తమ భార్య లేదా కుమార్తె గురించి "మా అమ్మాయి చాలా తెలివైనది", "మా భార్యకు మంచి తెలివి ఉంది" అని గర్వంతో చెప్పుకుంటూ ఉంటారు. అయితే ప్రాచీన కాలానికి చెందిన మేధావి చాణక్యుడు తెలివైన స్త్రీ ఎవరు అనే విషయాన్ని కొన్ని ప్రత్యేక లక్షణాల ఆధారంగా వివరించాడు. వాటిని ఇప్పుడు తెలుసుకుందాం.
వివరాలు
1. సహనంగా వ్యవహరించే స్త్రీ:
చాణక్యుని దృష్టిలో ఒక మహిళ ఎంత సమస్యలొచ్చినా ఆత్మస్థైర్యంతో, నిశ్శబ్దంగా వాటిని ఎదుర్కొంటే ఆమె అసలైన తెలివిగలవారంట. ఆమె ఇతరులను బాధపెట్టకుండా, ఎలాంటి తొందరపాటు నిర్ణయాలు తీసుకోకుండా సున్నితంగా వ్యవహరిస్తే, అలాంటి మహిళ జీవిత భాగస్వామిగా ఉండడం నిజంగా భాగ్యమే అని చెబుతాడు. 2. తీయగా మాట్లాడే లక్షణం: మంచిగా మాట్లాడే వ్యక్తుల మాటలు మనసుకు హత్తుకుంటాయి. అలానే తీయటి మాటలతో, వినయంగా మాట్లాడే స్త్రీపై అనుకోకుండా మంచి అభిప్రాయం ఏర్పడుతుంది. ఎటువంటి ఉద్వేగాలు ఉన్నా, నిగూఢంగా, సంయమనం పాటిస్తూ మాట్లాడగలగడం ఆమె తెలివిని సూచిస్తుంది అని చాణక్యుడు చెబుతాడు.
వివరాలు
3. ఆలోచించి నిర్ణయం తీసుకునే నైపుణ్యం:
తక్కువ సమయంలో త్వరిత నిర్ణయాలు తీసుకోకుండా, పరిస్థితుల్ని విశ్లేషించి నిర్ణయాలు తీసుకునే మహిళ నిజంగా తెలివైనదే. అలాంటి స్త్రీ కుటుంబం సంక్షోభంలోకి వెళ్లకుండా ముందుగానే ఆపగలదు. అంతేకాక, అందరినీ అర్థం చేసుకొని వారితో సమన్వయం కలిగిస్తూ కుటుంబాన్ని సమర్థంగా నడిపిస్తుంది. 4. డబ్బు విషయాల్లో జాగ్రత్తగా ఉండే మహిళ: ఆర్థిక విషయాల్లో పటుత్వం కలిగిన మహిళ చాలా తెలివైనదిగా భావించబడుతుంది. ఆమె భవిష్యత్తులో కుటుంబానికి ఎదురయ్యే సమస్యల నుంచి బయటపడేందుకు మార్గాలు రూపొందించగలదు. డబ్బును అర్థవంతంగా వినియోగించగల నైపుణ్యం ఆమెకు ఉన్నందువల్ల ఆర్థిక ఇబ్బందులను ఎదుర్కొనాల్సిన అవసరం తక్కువగా ఉంటుందని చాణక్యుడు వివరించాడు.