
ఆడవాళ్ళకు మాత్రమే: మీరు పుట్టిన నెల ప్రకారం మీకుండే లక్షణాలు
ఈ వార్తాకథనం ఏంటి
పుట్టిన తేదీ, నెల, రోజు ప్రకారం వారికి కొన్ని లక్షణాలు వస్తాయని చెప్పుకుంటారు. ప్రస్తుతం ఏ నెలలో పుట్టిన ఆడవాళ్ళు ఎలాంటి లక్షణాలు కలిగి ఉంటారో చూద్దాం.
జనవరి: అనుకున్న లక్ష్యాన్ని చేరుకోవడంలో ముందుంటారు. తమ ఫీలింగ్స్ బయటపెట్టారు. కోపం తొందరగా రాదు.
ఫిబ్రవరి: ఓపిక చాలా ఎక్కువ. రొమాంటిక్ పర్సన్స్, అనేక ఆలోచనలతో సతమతం అవుతారు.
మార్చ్: కళాత్మక హృదయం గలవారు. బంధంలోకి వెళ్ళడానికి ఆలోచిస్తారు.
ఏప్రిల్: లౌక్యం ఎక్కువ, ఎవరితోనైనా మాట కలిపేసే ధైర్యం ఉంటుంది. అవతలి వారి చూసి తొందరగా కుళ్ళుకుంటారు.
మే: ఆత్మవిశ్వాసంతో ఉంటారు. కష్టపడే తత్వం వీళ్ల సొంతం. ఎప్పుడూ పాజిటివ్ గా ఆలోచిస్తారు.
జూన్: జ్ఞానం కోసం పరుగెడతారు. బుర్రలో ఎన్నో ఆలోచనలు ఉంటాయి.
మహిళ
మరిన్ని నెలల సమాచారం
జులై: ప్రశాంతంగా ఉండాలనుకుంటారు. సమస్యల్లో పడడానికి ఇష్టపడరు. అవతలి వారి పట్ల నమ్మకంగా ఉంటారు.
ఆగస్టు: తెలివిగల వాళ్ళు, స్వార్థం కొంచెం ఎక్కువ ఉంటుంది. ఏ రంగంలోనైనా ముందుండాలనే కోరిక ఉంటుంది.
సెప్టెంబర్: క్రమశిక్షణగా ఉంటారు. తమ జీవిత భాగస్వాముల నుండి ఎక్కువ ఆశిస్తారు. సాంప్రదాయ బద్దంగా ఉండడానికి ఇష్టపడతారు.
అక్టోబర్: స్వతంత్రంగా ఉంటారు. మానసికంగా స్ట్రాంగ్ గా ఉంటారు. అవతలి వారు ముందు ఏడవడానికి ఇష్టపడరు.
నవంబర్: మొహమాటాలు వీళ్ళకు ఉండవు. ఉన్నది ఉన్నట్టు కుండబద్దలు కొట్టేస్తారు. నిజాయితీగా ఉంటారు.
డిసెంబర్: వీళ్ళు మనసులో ఏదీ ఉంచుకోరు. భోళా మనుషులు. ఎప్పుడూ నవ్వుతూ ఉండడానికి ఇష్టపడతారు. అలాగే అందరినీ నవ్విస్తూ ఉంటారు కూడా.