వర్కౌట్స్ చేసిన తర్వాత శరీరంలో నొప్పులు ఉంటున్నాయా? ఈ టెక్నిక్స్ పాటించండి
కొత్తగా వ్యాయామం మొదలు పెట్టిన వారికి శరీరంలో అక్కడక్కడా నొప్పులు కలుగుతాయి. కండరాల నొప్పి ఒక్కోసారి తీవ్రంగా ఇబ్బంది పెడుతుంది. ఈ నొప్పివల్ల మరుసటి రోజు వర్కౌట్స్ చేసే పరిస్థితి కూడా ఉండదు. మరి ఈ నొప్పిని తగ్గించలేమా? ఖచ్చితంగా తగ్గించవచ్చు. దానికోసం కొన్ని టెక్నిక్స్ ఉన్నాయి. అవేంటో చూద్దాం. కండరాల నొప్పిని తగ్గించే నీరు: వర్కౌట్స్ చేసిన తర్వాత వచ్చే నొప్పిని తగ్గించడానికి శరీరాన్ని హైడ్రేట్ గా ఉంచుకోవాలి. కావాల్సినన్ని నీళ్ళు తాగాలి. మరీ ఎక్కువగా కూడా తాగకూడదు. ఒకరోజులో ఎంత తాగాలో అంత తాగితే నొప్పులన్నీ మాయమైపోతాయి. విశ్రాంతి: శరీరానికి విశ్రాంతి నివ్వడం వల్ల కండరాల నొప్పులు తగ్గిపోతాయి. విశ్రాంతి సమయంలో కండరాలు పునరుత్తేజితమవుతాయి.
నొప్పులను తగ్గించే కాపడం
వెచ్చదనం అందించండి: 48గంటలు దాటినా కూడా మీ శరీరంలో నొప్పులు తగ్గట్లేదంటే, వెచ్చదనాన్ని శరీరానికి అప్లై చేస్తే బాగుంటుంది. గుడ్డను వెచ్చగా చేసి నొప్పులున్న చోట కాపడం పెడితే నొప్పులు మాయమైపోతాయి. గుడ్డను మరీ ఎక్కువగా కాల్చకండి. దానివల్ల మీ చర్మానికి గాయమై మరింత నొప్పి కలుగుతుంది. ఫోమ్ రోలర్ ఉపయోగించండి: ఫోమ్ రోలర్ తో మీ కండరాలను మసాజ్ చేయడం వల్ల నొప్పుల నుండి మంచి ఉపశమనం దొరుకుతుంది. మసాజ్ వల్ల రక్త ప్రసరణ కూడా మెరుగవుతుంది. వృత్తిరీత్యా మసాజ్ చేసే వారితో మసాజ్ చేయించుకుంటే మరింత ప్రయోజనం ఉంటుంది.