2023: కొత్త సంవత్సరంలో కొత్త అలవాట్లు.. మీ డైలీ డైట్ కి వీటిని జోడించండి
ఈ వార్తాకథనం ఏంటి
కొత్త సంవత్సరాన్ని కొత్త ఉత్సాహంతో మొదలు పెట్టడానికి అందరూ సిద్ధమైపోయారు. అలాగే కొత్త సంవత్సరంలో ఏమేం చేయాలనుకుంటున్నారో ఆల్రెడీ తీర్మానించేసుకున్నారు. ఈ తీర్మానాల్లో రోజువారి ఆహారం గురించి తప్పకుండా ఉంటుంది.
ఐతే వాటికి తోడుగా మీ డైలీ డైట్ కి ఎలాంటి అలవాట్లు చేర్చుకుంటే కొత్త సంవత్సరంలో మీరు మరింత ఆరోగ్యంగా ఉంటారో తెలుసుకుందాం.
రుతువులో దొరికే ప్రత్యేక ఆహారాలు: ఏ రుతువులో దొరికే ఆహారాలను ఆ రుతువులో ఖచ్చితంగా తినాలి. ప్రస్తుతం చలికాలం కాబట్టి, కూరగాయలను, ఆకుకూరలను మీ డైట్ లో చేర్చుకోండి.
తాజా ఆహారలనే తినండి: ప్రాసెస్డ్ ఫుడ్ వైపు చూడకుండా ఇంట్లో చేసుకున్న తాజా ఆహారాలకే ప్రాధాన్యం ఇవ్వండి. బయట తినడాలు తగ్గించండి.
ఆరోగ్యకరమైన ఆహారం
మరికొన్ని డైట్ సూచనలు
ఎక్కువ నమలండి: ఆహారాన్ని సరిగ్గా నమలకుండా తింటే జీర్ణాశయం మీద ఎక్కువ భారం పడుతుంది. అదేకాదు ఎక్కువగా నమలడం వల్ల ఆహారంలోని పోషకాలు శరీరానికి సరిగ్గా అందుతాయి.
ఎక్కువ తినకండి: కడుపు నిండుగా ఎప్పుడూ తినవద్దు. 20శాతం ఖాళీ ఉంచుకోండి. నిండుగా తినడం వల్ల బద్దకంగా ఉంటుంది. దానివల్ల శరీర కదలికలు తక్కువగా ఉంటాయి. సో బరువు పెరుగుతారు.
విభిన్న రకాల ఆహార ధాన్యాలు: ఎప్పుడూ ఒకే రకానికి చెందిన ధాన్యాలతో చేసిన ఆహారాలు తినకుండా వేరు వేరు రకాల ధాన్యాలను మీ డైట్ లో చేర్చుకోండి.
నీళ్ళు తాగండి: మీ శరీరానికి కావాల్సినన్ని నీళ్ళు తాగండి. దానివల్ల డీహైడ్రేషన్ అవకుండా ఉంటుంది. అలాగే ఆహారాల్లో ఉప్పు, చక్కెరను తగ్గించండి.