Mysore Dasara 2024: మైసూర్ పాక్‌తోపాటు.. మైసూర్‌లో మిస్సవ్వకూడని వంటకాలివే!
మైసూర్ పాక్ అంటే ప్రతి ఒక్కరికీ గుర్తొచ్చేది నోట్లో కరిగిపోయే మెత్తటి స్వీట్. అసలు రుచి చూడాలంటే మైసూర్‌కి వెళ్లాల్సిందే. అయితే మైసూర్ పాక్‌తోపాటు మైసూర్‌లో లభించే మరికొన్ని స్పెషల్ వంటకాలు కూడా ట్రై చేయక తప్పదు. మీకు వాటి గురించి తెలిస్తే, మైసూర్ పర్యటన మరింత రుచికరంగా మారుతుంది. శనగ పిండి, షుగర్, నెయ్యి, యాలకులు కలిపి వీటిని తయారు చేస్తారు. వీటి రుచి చూస్తే మైమరిచిపోవాల్సిందే. బిస్బెలేబాత్ కర్ణాటకలో ప్రసిద్ధి చెందిన బిస్బెలేబాత్‌ను మైసూర్‌లో వేరే లెవల్‌లో చేస్తారు. వివిధ రకాల పప్పులు, కూరగాయలు కలిపి చేసిన ఈ రుచికరమైన వంటకం మైసూర్‌కు ప్రత్యేకతగా నిలుస్తుంది. ఆ రుచి మిమ్మల్ని మాయలో పడేస్తుంది.
మైసూర్ మసాలా దోసె
మసాలా దోసెని చాలా చోట్ల తిన్నా మైసూర్ మసాలా దోసెకు మాత్రం చాలా ప్రత్యేకత ఉంది. నట్ చట్నీతో సర్వ్ చేసే ఈ దోసెను ఒక్కసారి రుచి చూస్తే మళ్లీ మళ్లీ తినాలనిపిస్తుంది. ఖారా బాత్ మైసూర్‌లో 'ఉప్మా'కి మరో పేరు ఖారా బాత్. సుజీ రవ్వ, కూరగాయలు, జీడిపప్పు వంటివి కలిపి చేసిన ఈ వంటకం మైసూర్ ప్రాంతంలో చాలా ప్రసిద్ధి గాంచింది. దీనిలో రుచి, సులువైన తయారీని తలుచుకుంటే మళ్లీ మైసూర్ వెళ్లాలని అనిపించకమానదు. జాస్మిన్ ఇడ్లీ పరిమళం వచ్చేలా చిన్నగా ఉండే జాస్మిన్ ఇడ్లీ మైసూర్‌లో ప్రసిద్ధం. వివిధ రకాల చట్నీలు, సాంబార్‌లతో వడ్డించే ఈ ఇడ్లీని మైసూర్ పర్యటనకు వెళ్లినప్పుడు తప్పకుండా ట్రై చేయాల్సిందే.