ఆరోగ్యం: మగవాళ్ళలో కామకోరికలను పెంచే దూలగొండి గింజల ప్రాధాన్యం
దూలగొండి గింజలు అంటే అందరికీ అర్థం కాకపోవచ్చు కానీ దురదపుట్టించే ఆకు గురించి అందరికీ తెలిసే ఉంటుంది. దూలగుండి ఆకులను ముట్టుకుంటే చాలు దురదతో చచ్చిపోవాల్సిందే. అలాంటి లక్షణం ఉన్న ఈ మొక్క నుండి వచ్చే గింజలకు ఆయుర్వేదంలో మంచి ప్రాధాన్యం ఉంది. ఇవి అనేక వ్యాధులను దూరం చేయడంలో సాయపడతాయి. పార్కిన్ సన్ వ్యాధిని నయం చేయడంలో ప్రభావం చూపిస్తుంది: ఈ వ్యాధి మెదడులో డోపమైన్ అనేది పూర్తిగా విడుదల అవ్వకపోవడం వల్లనో, లేదంటే చాలా తక్కువ రిలీజ్ అవడం వల్లనో కలుగుతుంది. దూలగొండి గింజల్లోని పోషకాలు డోపమైన్ ఉత్పత్తిని ప్రేరేపిస్తాయి. ఒకానొక అధ్యయనం ప్రకారం దూలగొండి గింజలు పార్కిన్ సన్స్ వ్యాధిని నయం చేయడంతో ప్రభావాన్ని చూపిస్తున్నాయని తేలింది.
మగవాళ్ళలో కామ కోరికలను పెంచుతుంది
పురాతన కాలంలో మగవాళ్ళలో కామకోరికలను పెంచడానికి దూలగొండి గింజలను వాడేవారు. మగవాళ్ళలో సంతాన ప్రాప్తిని ఇది ప్రేరేపిస్తుంది. ఇందులో ఉండే యాంటీ ఆక్సిడెంట్లు శృంగార పరంగా ఆరోగ్యంగా ఉంచుతాయి. అధ్యయనాల ప్రకారం మగవాళ్లలో వీర్యకణాల ఉత్పత్తి దూలగొండి గింజల ద్వారా పెరిగినట్లు తెలిసింది. అలాగే స్తంభన సమస్యలను దూరం చేస్తుంది. ఇంకా వీర్యం నాణ్యతను పెంచుతుంది. నిద్ర: ఈ మధ్య చాలామంది సరైన నిద్రలేక చాలా ఇబ్బంది పడుతున్నారు. అలాంటి ఇబ్బందులను తీర్చే శక్తి దూలగొండి గింజలకు ఉంది. ఐతే ఈ గింజలను డాక్టర్ సలహా మేరకే తీసుకోవాలి. దీనివల్ల సైడ్ ఎఫెక్ట్స్ కూడా ఉంటాయి. తలనొప్పి, గుండె వేగంగా కొట్టుకోవడం, ఆందోళన, భ్రమ పడటం మొదలగు దుష్ఫలితాలు ఉంటాయి.