Moringa Leaves: రోజూ మునగాకులు తింటే కలిగే అద్భుత ఆరోగ్య ప్రయోజనాలు!
ఈ వార్తాకథనం ఏంటి
మన పరిసరాల్లో ఎన్నో ఔషధ గుణాలతో కూడిన మొక్కలు, చెట్లు పెరుగుతాయి. అయితే వాటి ఆరోగ్య ప్రయోజనాలను చాలామంది ఎప్పుడూ పట్టించుకోరు.
ఈ జాబితాలో మునగ చెట్టుకి ఒక ప్రత్యేక స్థానం ఉంది. మునగ కాయలతో పాటు మునగ ఆకులు కూడా ఎన్నో రకాల ఆరోగ్య ప్రయోజనాలు అందిస్తాయి.
వైద్యులు మునగాకులను సూపర్ ఫుడ్ అని కూడా పేర్కొంటారు. వీటిలో ఉన్న యాంటీ ఆక్సిడెంట్లు, విటమిన్లు, మినరల్స్ 300 రకాల రోగాలను నయం చేసే అవకాశం ఉంటుంది.
అందుకే మునగాకులను మన ఆహారంలో భాగంగా చేసుకోవడం ఎంతో ముఖ్యమని నిపుణులు సూచిస్తున్నారు. మునగాకులను నేరుగా తినడం కొంతమందికి కష్టంగా ఉండొచ్చు.
Details
సమృద్ధిగా మునగాకులో ఫైబర్, ప్రొటిన్లు
దీన్ని ఆహారంలో భాగం చేసుకుంటే క్రమంగా రుచి గానూ మారుతుంది. మునగాకులలో ఉండే యాంటీ ఆక్సిడెంట్లు ఆక్సీకరణ ఒత్తిడి, వాపులను తగ్గిస్తాయి.
ఇది గుండె జబ్బులను నిరోధించి గుండెను ఆరోగ్యంగా ఉంచుతుంది. మునగాకులలో ఫైబర్, ప్రొటీన్లు సమృద్ధిగా ఉండటంతో జీర్ణవ్యవస్థ పనితీరును మెరుగుపరుస్తాయి.
అయితే వీటిని పొడిలా తయారు చేసి, పచ్చడి, పప్పు లేదా సాంబార్, రసం వంటివి చేసుకుని తినవచ్చు.
మునగాకులు పోషకాలను సమృద్ధిగా కలిగివుంటాయి. 100 గ్రాముల మునగాకుల్లో విటమిన్ సి - 18 మిల్లీగ్రాములు, విటమిన్ ఎ - 9100 IU, క్యాల్షియం - 130 మిల్లీగ్రాములు, ప్రోటీన్ 4 గ్రాములు ఉంటాయి.
Details
చర్మ ఆరోగ్యం
మునగాకులలో విటమిన్ సి, విటమిన్ ఎ కొల్లాజెన్ ఉత్పత్తి చేయడానికి సాయపడతాయి. ఈ కారణంగా చర్మం కాంతివంతంగా కనిపిస్తుంది. ముఖంపై ముడతలు తగ్గి యవ్వనంగా ఉండేలా చేస్తుంది.
షుగర్ లెవల్స్ నియంత్రణ
మునగాకులను తినడం వల్ల రక్తంలో షుగర్ స్థాయిలు తగ్గిపోతాయి. డయాబెటిస్ ఉన్నవారికి ఇవి ఒక వరం లాంటి ఆహారంగా మారతాయి.
ఇవి శరీర శక్తి స్థాయిలను పెంచి, అలసట మరియు నీరసం నుంచి ఉపశమనం ఇస్తాయి. ఉదయం మునగాకులు తింటే రోజంతా చురుకుగా ఉండేలా చేస్తాయి.
Details
రోజువారీ ఆహారంలో మునగాకులు ఎంతో మేలు
ఈ ఆకులను సాంబార్, రసం, పప్పు వంటి వంటకాలలో చేర్చుకోవడం ద్వారా దీని ప్రయోజనాలను పొందవచ్చు.
మునగాకులను తినడం వల్ల అనేక రకాల ఆరోగ్య ప్రయోజనాలు అందుతాయి. కనుక వీటిని మీ ఆహారంలో తప్పకుండా భాగం చేసుకోండి.
నొప్పుల నుంచి ఉపశమనం
మునగాకులలో ఉండే సమ్మేళనాలు శరీరంలో వాపులు, నొప్పులను తగ్గిస్తాయి. ముఖ్యంగా ఆర్థరైటిస్‌తో బాధపడేవారికి ఇది ఎంతో మేలు చేస్తుంది.