Ganesh Idols And Procession 2024: గణేష్ మండపాలకు అనుమతి పొందడం ఎలా? దరఖాస్తు విధానం ఇదే!
ఈ వార్తాకథనం ఏంటి
ఈ ఏడాది వినాయక చవితి సెప్టెంబర్ 7న జరుపుకోనున్నారు. ఈ సందర్భంగా 11 రోజుల పాటు ఉత్సవాలు అంగరంగ వైభవంగా నిర్వహించబడతాయి.
వినాయక చవితి వేడుకల్లో భాగంగా గణేష్ మండపాలను చాలామంది ఏర్పాటు చేస్తారు.
అయితే, గణేష్ మండపం ఏర్పాటు చేయాలనుకునే వారు పోలీసు వారి అనుమతులు తప్పనిసరిగా తీసుకోవాలి.. లేకపోతే చట్టపరమైన చర్యలు ఎదుర్కోవాల్సి వస్తుంది.
హైదరాబాదు పోలీసులు సెప్టెంబర్ 6వ తేదీ వరకు ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవాలని సూచించారు. దరఖాస్తు విధానం ఇలా ఉంటుంది:
వివరాలు
గణేష్ మండపాలకు దరఖాస్తు చేసే విధానం:
Police Portal వెబ్‌సైట్ (policeportal.tspolice.gov.in) ద్వారా లాగిన్ కావాలి.
దరఖాస్తుదారుడి వివరాలు, పూర్తి చిరునామా, అసోసియేషన్ నేమ్ వంటి సమాచారం నమోదు చేయాలి.
మండపం ఎక్కడ, ఎంత ఎత్తులో, గణేశ విగ్రహం ఎత్తు ఎంత ఉండాలని, విగ్రహాన్ని ఎన్ని రోజులు ఉంచుతారనే వివరాలు ఇవ్వాలి.
మండపం ఏ కమీషనరేట్ పరిధిలో వస్తుందో, పోలీస్ స్టేషన్ వివరాలను కూడా నమోదు చేయాలి.
చివరిగా, నిమజ్జనం ఏ తేదీ, సమయం, ఎక్కడ జరుగుతుందో వివరించాలి.
దరఖాస్తు సబ్మిట్ చేయగానే, రిఫరెన్స్ నంబర్ ద్వారా రశీదు డౌన్‌లోడ్ చేసుకోవచ్చు.
వివరాలు
నిబంధనలివే..
వివాదాస్పద ప్రదేశాల్లో మండపాల ఏర్పాటుకు అనుమతి లేదు.
మండపాల స్థల యజమానుల నుంచి NOC తప్పనిసరి.
విద్యుత్ ఏర్పాటుకు సంబంధిత శాఖ నుంచి అనుమతి పొందాలి.
రాత్రి 10 గంటల నుంచి ఉదయం 6 గంటల వరకు లౌడ్ స్పీకర్ల వినియోగంపై నిషేధం ఉంది.
సెల్లార్ లేదా కాంప్లెక్స్‌ల్లో విగ్రహాల ఊరేగింపులకు పోలీసుల అనుమతి తప్పనిసరి.
వాలంటీర్లు కార్డులు లేదా బ్యాడ్జీలు ధరించాలి.
ఊరేగింపులు మార్గం, సమయం ముందే పోలీసులకు తెలియజేయాలి.
మండపాల వద్ద అగ్నిమాపక పరికరాలు ఏర్పాటు చేయాలి. ఈ విధంగా, గణేష్ మండపం ఏర్పాటు చేయడానికి సరైన అనుమతులు పొందడం ద్వారా చట్టపరంగా సమస్యలు లేకుండా వేడుకలను జరుపుకోవచ్చు.