ఏప్రిల్ ఫూల్స్ డే 2023: ఫూల్స్ డే ఎలా పుట్టింది? దీని వెనుక కథేంటి?
ఏప్రిల్ 1వ తేదీ రాగానే అవతలి వారిని ప్రాంక్ చేయడం అందరికీ అలవాటు. చిన్నప్పుడు ఇది మరింత ఎక్కువగా ఉండేది. స్కూళ్ళలో అయితే ఏప్రిల్ ఫూల్ ఫూల్ అంటూ అల్లరి చేసేవారు. చిన్నప్పుడు కేవలం 1వ తేదీన మాత్రమే కాకుండా ఏప్రిల్ నెల మొత్తం ప్రాంక్ చేసేవారు. అయితే అసలు ఏప్రిల్ ఫూల్స్ డే ఎలా పుట్టింది? దీని వెనుక కథేంటో మీకు తెలుసా? ఇక్కడ తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ఫూల్స్ ఎప్పుడు పుట్టిందో సరైన ఆధారాలు లేవు. ఈ విషయంలో ఒక్కో దగ్గర ఒక్కో కథ ప్రచారంలో ఉంది. కాకపోతే ఎక్కువ దేశాల్లో ప్రచారంలో ఉన్న కథ ప్రకారం, ప్రపంచంలోని చాలా దేశాలు తమ క్యాలెడర్ ని మార్చుకున్నాయి.
క్యాలెండర్ లో వచ్చిన మార్పుతో ఫూల్ గా మారిన జనాలు
అప్పటివరకూ జూలియన్ క్యాలెండర్ వాడుతున్న దేశాలు గ్రెగోరియన్ క్యాలెండర్ వైపు మారారు. దీని ప్రకారం జనవరి 1వ తేదీని కొత్త సంవత్సర ఆరంభ రోజుగా జరుపుకున్నారు. ఈ విషయం తెలియని చాలామంది, పాత జూలియన్ క్యాలెండర్ లోని కొత్త సంవత్సర ఆరంభ రోజును ఫాలో అయ్యారు. అలా ఏప్రిల్ 1వ తేదీని కొత్త సంవత్సరంగా జరుపుకుంటున్న వాళ్ళను చూసి, ఫూల్స్ అంటూ ఎగతాళి చేయడం మొదలైంది. ఇది క్రమంగా ఏప్రిల్ ఫూల్స్ డే గా మారింది. ఏప్రిల్ ఫూల్స్ డే రోజున కొన్ని దేశాల్లో అధికారిక హాలీడే ఉంటుంది. ఫూల్స్ డేని జరుపుకోవడానికి ప్రభుత్వం అనుమతులు ఇస్తుంది. మొత్తానికి ఏప్రిల్ ఫూల్ కథ ఇదన్నమాట.