LOADING...
Health Tips: మనం రోజూ తినే ఈ 7 ఆహారాలే క్యాన్సర్ ముప్పుకు కారణమా? నిపుణుల హెచ్చరిక ఇదే!
మనం రోజూ తినే ఈ 7 ఆహారాలే క్యాన్సర్ ముప్పుకు కారణమా? నిపుణుల హెచ్చరిక ఇదే!

Health Tips: మనం రోజూ తినే ఈ 7 ఆహారాలే క్యాన్సర్ ముప్పుకు కారణమా? నిపుణుల హెచ్చరిక ఇదే!

వ్రాసిన వారు Jayachandra Akuri
Dec 20, 2025
03:01 pm

ఈ వార్తాకథనం ఏంటి

ఏ ఆహారమూ నేరుగా క్యాన్సర్‌కు కారణం కాదని, అయితే కొన్ని రకాల ఆహారాలను తరచూ తీసుకోవడం వల్ల కాలక్రమేణా క్యాన్సర్ ముప్పు పెరుగుతుందని ప్రముఖ నిపుణులు పేర్కొంటున్నారు. మన జీవనశైలి, ముఖ్యంగా ఆహారపు అలవాట్లు ఆరోగ్యంపై తీవ్ర ప్రభావం చూపుతాయని చెప్పారు. క్యాన్సర్ ప్రమాదాన్ని పెంచే ఆహార పదార్థాలపై ఆయన చేసిన కీలక వ్యాఖ్యలను ఇప్పుడు తెలుసుకుందాం.

Details

క్యాన్సర్ ముప్పును పెంచే 7 ఆహార పదార్థాలు

1. ప్రాసెస్డ్ మీట్ (నిల్వ ఉంచిన మాంసం) సాసేజ్‌లు, బేకన్, సలామీ, హాట్‌డాగ్స్ వంటి ప్రాసెస్ చేసిన మాంసంలో నైట్రేట్లు, నైట్రైట్లు అధికంగా ఉంటాయి. ఇవి శరీరంలోకి వెళ్లిన తర్వాత 'నైట్రోసమైన్' అనే క్యాన్సర్ కారక సమ్మేళనాలుగా మారుతాయి. అలాగే మాంసాన్ని స్మోకింగ్ (పొగతో ఉడికించడం) చేయడం వల్ల విడుదలయ్యే రసాయనాలు కడుపు, పేగు, రొమ్ము క్యాన్సర్లకు దారి తీసే అవకాశం ఉందని పలు అధ్యయనాలు వెల్లడించాయి.

Details

2. మితిమీరిన రెడ్ మీట్ వినియోగం 

బీఫ్, పోర్క్, లాంబ్ వంటి రెడ్ మీట్‌ను పరిమితంగా తీసుకుంటే పెద్ద ప్రమాదం ఉండదని, కానీ తరచూ తీసుకుంటే క్యాన్సర్ ముప్పు పెరుగుతుందని డాక్టర్ హెచ్చరించారు. ముఖ్యంగా అధిక ఉష్ణోగ్రతల వద్ద గ్రిల్లింగ్ లేదా బార్బెక్యూ చేసినప్పుడు క్యాన్సర్‌కు కారణమయ్యే రసాయనాలు తయారవుతాయని తెలిపారు. అందుకే తక్కువ మంటపై మాంసాన్ని ఉడికించుకోవడం మంచిదని సూచించారు. 3. డీప్ ఫ్రై చేసిన ఆహారం ఫ్రెంచ్ ఫ్రైస్, చిప్స్, పకోడీలు వంటి నూనెలో వేయించిన పదార్థాల్లో 'అక్రిలమైడ్' అనే హానికరమైన రసాయనం ఏర్పడుతుంది. పిండి పదార్థాలను అధిక ఉష్ణోగ్రత వద్ద వేయించినప్పుడు ఇది ఉత్పత్తి అవుతుంది. ఇది క్యాన్సర్ ముప్పుతో పాటు ఊబకాయం, మధుమేహం వంటి సమస్యలకు కూడా దారి తీస్తుంది.

Advertisement

Details

4. చక్కెర, రిఫైన్డ్ కార్బోహైడ్రేట్లు

చక్కెర నేరుగా క్యాన్సర్‌కు కారణం కాకపోయినా, బరువు పెరగడం, ఇన్సులిన్ రెసిస్టెన్స్‌ను పెంచడం ద్వారా శరీరంలో దీర్ఘకాలిక వాపును కలిగిస్తుందని నిపుణులు చెబుతున్నారు. దీని ప్రభావంతో రొమ్ము, పేగు క్యాన్సర్ల ప్రమాదం పెరుగుతుంది. మైదా వంటి రిఫైన్డ్ కార్బోహైడ్రేట్లు శరీరంలో ఆక్సిడేటివ్ స్ట్రెస్‌ను పెంచుతాయని డాక్టర్ బన్సాల్ పేర్కొన్నారు. 5. ప్యాక్ చేసిన అల్ట్రా-ప్రాసెస్డ్ ఫుడ్స్ ఇన్‌స్టంట్ నూడుల్స్, ప్యాక్ చేసిన స్నాక్స్, రెడీ-టు-ఈట్ భోజనాల్లో ప్రిజర్వేటివ్‌లు, అనారోగ్యకరమైన కొవ్వులు అధికంగా ఉంటాయి. ఇవి జీర్ణకోశ క్యాన్సర్ ముప్పును పెంచడమే కాకుండా, శరీరంలోని రోగనిరోధక వ్యవస్థను బలహీనపరుస్తాయని ఆయన హెచ్చరించారు.

Advertisement

Details

6. మద్యం (Alcohol) 

మద్యం శరీరంలోకి వెళ్లిన తర్వాత 'అసిటాల్డిహైడ్' అనే విషపూరిత సమ్మేళనంగా మారుతుందని డాక్టర్ తెలిపారు. ఇది మన డీఎన్ఏను దెబ్బతీస్తుంది. తక్కువ మోతాదులో మద్యం తీసుకున్నప్పటికీ కాలేయం, నోరు, గొంతు, రొమ్ము క్యాన్సర్ల ముప్పు ఉంటుందని నిపుణులు స్పష్టం చేస్తున్నారు. 7. మాడిపోయిన లేదా అతిగా వేయించిన ఆహారం గ్రిల్ చేసినప్పుడు లేదా నూనెలో వేయించినప్పుడు మాడిపోయిన భాగాల్లో ప్రమాదకరమైన రసాయనాలు ఉంటాయని తెలిపారు. ఆహారాన్ని నల్లగా మాడిపోయేంత వరకు వేయించకుండా, దోరగా ఉడికించుకోవడం ద్వారా ఈ ముప్పును తగ్గించుకోవచ్చని సూచించారు.

Details

ఆహారంలో దాగి ఉండే ఇతర విషతుల్యాలు

BPA ప్లాస్టిక్ డబ్బాలు, టిన్ క్యాన్లలో ఉండే BPA హార్మోన్ల సమతుల్యతను దెబ్బతీసి క్యాన్సర్ ప్రమాదాన్ని పెంచుతుంది. ఆఫ్లాటాక్సిన్స్ సరిగా నిల్వ చేయని ధాన్యాలు, వేరుశెనగల్లో ఏర్పడే బూజు వల్ల వచ్చే ఆఫ్లాటాక్సిన్స్ కాలేయ క్యాన్సర్‌కు ప్రధాన కారణమవుతాయి. క్రిమిసంహారక మందులు ఆహార పదార్థాలపై ఉండే పెస్టిసైడ్స్ అవశేషాలు దీర్ఘకాలంలో శరీరానికి హానికరంగా మారుతాయని నిపుణులు హెచ్చరిస్తున్నారు.

Advertisement