Health Risks of Plastic Bottles: ప్లాస్టిక్ సీసాల్లో నీరు తాగుతున్నారా? శరీరంలోకి విషకణాలు చేరే అవకాశం!
ఈ వార్తాకథనం ఏంటి
ప్లాస్టిక్ సీసాల్లో నీరు తాగడం చాలా మందికి సాధారణ అలవాటే కానీ, ఆరోగ్య నిపుణుల ప్రకారం ఇది శరీరంపై తీవ్రమైన ప్రతికూల ప్రభావాలు చూపే ప్రమాదం ఉంది. ప్లాస్టిక్ బాటిల్‌లో నీళ్లు తాగితే ఏమవుతుంది?" అని భావించడం తప్పు అని తాజా పరిశోధనలు స్పష్టం చేస్తున్నాయి. నిపుణులు ముఖ్యంగా చెబుతున్న విషయం ఏమిటంటే.. ప్లాస్టిక్ బాటిళ్లను మళ్లీ మళ్లీ వాడటం అత్యంత ప్రమాదకరం. మనలో చాలామంది పాత సీసాలను కడిగి తిరిగి వాడే అలవాటు కలిగి ఉంటారు. కానీ ఆ సీసాలు అరిగిపోవడంతో వాటి నుంచి మైక్రోప్లాస్టిక్‌లు నీటిలోకి చేరుతున్నాయని పరిశోధకులు హెచ్చరిస్తున్నారు. మైక్రోప్లాస్టిక్‌లు అనేవి అతి సూక్ష్మ పరిమాణంలో ఉన్న ప్లాస్టిక్ కణాలు.
Details
ఆరోగ్య సమస్యలు వస్తాయని నిపుణుల హెచ్చరిక
పాత ప్లాస్టిక్ వస్తువుల అరిగిపోవడం, బట్టల నుంచి విడిపోయే మైక్రోఫైబర్లు, ముఖ్యంగా ప్లాస్టిక్ వాటర్ బాటిళ్ల కరుగుదల వల్ల ఇవి నీరు వంటి వనరుల్లోకి చేరతాయి. ఈరోజుల్లో సముద్రాలు, నదులు, నేల, గాలి—ప్రతి చోట మైక్రోప్లాస్టిక్ కాలుష్యం విస్తరిస్తోందని శాస్త్రవేత్తలు హెచ్చరిస్తున్నారు. అంతర్జాతీయ అధ్యయనాలు కూడా బాటిల్ వాటర్‌లో అధిక స్థాయిలో మైక్రోప్లాస్టిక్ కణాలు ఉన్నట్లు నిర్ధారించాయి. ఇవి మన శరీరంలోకి ప్రవేశించి వాపు, ఆక్సిడేటివ్ స్ట్రెస్, హానికర రసాయనాల బదిలీ వంటి ఆరోగ్య సమస్యలకు దారితీసే అవకాశముందని వైద్య నిపుణులు చెబుతున్నారు.
Details
ప్లాస్టిక్ వినియోగాన్ని తగ్గించాలి
ఈ నేపథ్యంలో నేషనల్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ హెల్త్ కూడా ముఖ్యమైన నివేదిక విడుదల చేస్తూ ప్లాస్టిక్ వినియోగాన్ని తగ్గించాలని ప్రజలకు సూచించింది. ఆరోగ్యం పరిరక్షించుకోవాలంటే స్టీల్ బాటిళ్లు, గాజు సీసాలు, BPA-రహిత బాటిళ్లను ఉపయోగించుకోవాలని నిపుణులు సిఫార్సు చేస్తున్నారు. అంతేకాక, వడపోసిన లేదా శుద్ధి చేసిన నీరు తీసుకోవడం మంచిదని స్పష్టం చేస్తున్నారు. ప్లాస్టిక్ వినియోగాన్ని తగ్గించడం వల్ల వ్యక్తిగత ఆరోగ్యమే కాకుండా పర్యావరణాన్ని కూడా పెరుగుతున్న కాలుష్య ప్రమాదం నుంచి రక్షించవచ్చని నిపుణులు చెబుతున్నారు.