LOADING...
Motivation: ఎవరికైనా డబ్బు ఇస్తున్నారా? ముందు ఈ విషయాలను తెలుసుకోండి! 
ఎవరికైనా డబ్బు ఇస్తున్నారా? ముందు ఈ విషయాలను తెలుసుకోండి!

Motivation: ఎవరికైనా డబ్బు ఇస్తున్నారా? ముందు ఈ విషయాలను తెలుసుకోండి! 

వ్రాసిన వారు Jayachandra Akuri
Nov 09, 2025
10:59 am

ఈ వార్తాకథనం ఏంటి

ఆచార్య చాణక్యుడు గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఆయన ఒక మహా పండితుడు, తత్వవేత్త, రాజకీయనిపుణుడు, ఆర్థిక శాస్త్రజ్ఞుడు. తన జ్ఞానం, ప్రాజ్ఞతో చరిత్రలో చిరస్థాయిగా నిలిచిపోయారు. చాణక్యుడు మనిషి జీవన విధానం, ధనం, నీతి, రాజకీయాలు, ఆర్థిక వ్యవహారాలపై ఎన్నో విలువైన సూత్రాలను చెప్పాడు. డబ్బు సంపాదించడం ఎంత ముఖ్యమో, దాన్ని సరైన రీతిలో ఖర్చు చేయడం, పొదుపు చేయడం కూడా అంతే అవసరమని ఆయన హితవు పలికాడు. అలాగే డబ్బు ఎవరికి ఇవ్వాలి, ఎవరికి ఇవ్వకూడదు అనే అంశంపై కూడా స్పష్టమైన మార్గదర్శకాలు ఇచ్చాడు. చాణక్య నీతిలో పేర్కొన్న విధంగా, కొంతమందికి డబ్బు ఇవ్వడం వల్ల మనకే నష్టం కలుగుతుందని ఆయన హెచ్చరించాడు.

Details

చాణక్యుడి ప్రకారం ఎవరికి డబ్బు ఇవ్వకూడదంటే

1. చెడు ప్రవర్తన ఉన్నవారికి డబ్బు ఇవ్వవద్దు దుర్వ్యవహారంతో, అహంకారంతో, అబద్ధాలతో జీవించే వ్యక్తులకు డబ్బు ఇవ్వడం వలన అది తిరిగి రాదు. అంతేకాక, మీరు ఆర్థిక ఇబ్బందుల్లో పడే ప్రమాదం ఉంది. 2. ఎప్పుడూ అసంతృప్తిగా ఉండే వారికి డబ్బు ఇవ్వవద్దు జీవితం పట్ల ప్రతికూల దృక్పథం కలిగి, ఎప్పుడూ ఫిర్యాదులతో జీవించే వ్యక్తులకు డబ్బు ఇవ్వడం వృథా. వారు ఆ డబ్బును సరైన పనులకు ఉపయోగించరు. ఫలితంగా మీరు నష్టపోతారు.

Details

3. డబ్బు విలువ తెలియని వారికి డబ్బు ఇవ్వవద్దు 

ధనాన్ని అర్థరహితంగా ఖర్చు చేసే, పొదుపు చేయడం తెలియని వ్యక్తులకు డబ్బు ఇచ్చితే, వారు దాన్ని వృథా చేస్తారు. వారి చేతుల్లో డబ్బు నిలవదు. ఈ కారణంగా మీరు కూడా కష్టాల్లో పడే అవకాశం ఉంటుంది. చాణక్యుడు స్పష్టం చేసినట్లు డబ్బు అనేది జాగ్రత్తగా వినియోగించాల్సిన శక్తి. దాన్ని సరైన వ్యక్తులకు మాత్రమే ఇవ్వాలి. లేకపోతే ఆ ధనం మన జీవితంలో సమస్యలకే కారణం అవుతుంది. చాణక్యుడు చెప్పిన ఈ సూత్రాలు నేటికీ ప్రాసంగికమే. డబ్బు ఇవ్వడంలో కూడా ఆలోచించి, పరిశీలించి, నియమాలను పాటించాలని ఆయన ఉపదేశం.