దసరా నవరాత్రుల్లో ఉపవాసం ఉంటున్నారా? అయితే ఈ పొరపాట్లు చేయకండి
దసరా నవరాత్రులు వచ్చేస్తున్నాయి. నవరాత్రుల్లో ఉపవాసం ఉండేవారు కొన్ని విషయాల్లో చాలా జాగ్రత్తలు తీసుకోవాలి. ముఖ్యంగా నవరాత్రుల్లో ఉపవాసం ఉండేవారు కొన్ని పొరపాట్లు అస్సలు చేయకూడదు. ప్రస్తుతం ఆ పొరపాట్లు ఏంటో తెలుసుకుందాం. మరీ కఠినమైన ఉపవాసం: ఉపవాసం పేరిట అస్సలు ఆహారం తీసుకోకుండా ఉండడం సమంజసం కాదు. మన శరీరానికి ఒక రోజులో 1200కేలరీల శక్తి అవసరం కాబట్టి మరీ కఠినమైన ఉపవాసం ఉండకుండా ఆరోగ్యాన్ని కాపాడుకోవడం మంచిది. లేదంటే వికారము, గ్యాస్ట్రిక్ సమస్యలు, అలసట, లో బీపీ వంటి సమస్యలు వస్తాయి. అధిక వ్యాయామాలు: ఉపవాసం ఉండే రోజుల్లో అధికంగా వ్యాయామం చేయకూడదు. ఉపవాసం వల్ల శరీరానికి శక్తి ఉండదు కాబట్టి అధిక వ్యాయామం చేయడం వల్ల అలసిపోతారు.
అనారోగ్యకరమైన ఆహారాలతో ఉపవాసం విరమించడం
రోజంతా ఉపవాసం చేసి సాయంత్రం ఉపవాసం విరమించే సమయంలో నూనెలో ఫ్రై చేసిన ఆహారాలు, పూరీలు, చక్కెర అధికంగా ఉన్న ఆహారాలను తీసుకోవడం మంచిది కాదు. దీనివల్ల రక్తంలో చక్కెర స్థాయిలు అమాంతం పెరిగిపోతాయి. డీహైడ్రేషన్: ఉపవాసం సమయంలో శరీరానికి కావాల్సినన్ని నీళ్లు కచ్చితంగా తీసుకోవాలి. లేదంటే శరీరంలో నీరు తగ్గిపోయి అనేక సమస్యలు వస్తాయి. నీరు మాత్రమే కాకుండా కొబ్బరినీళ్లు ఇంకా పండ్ల రసాలు తీసుకోవడం మంచిది. వీటివల్ల శరీరంలో నీరు తగ్గిపోకుండా ఉంటుంది. టీ కాఫీ అధికంగా తీసుకోకూడదు: ఉపవాసం సమయంలో చాలామంది టీ లేదా కాఫీ అధికంగా తీసుకుంటారు. కానీ ఇది ఎంత మాత్రం మంచిది కాదు. దీనివల్ల అసిడిటీ, గుండె మంట, డీహైడ్రేషన్ వంటి సమస్యలు వస్తాయి.