Plants Wilting: మొక్కలు వాడిపోతున్నాయా? ఈ టిప్స్ మీకోసమే
ఈ వార్తాకథనం ఏంటి
చాలా మంది తమ ఇళ్లల్లో పచ్చని మొక్కలు పెంచుకుని మురిసిపోతుంటారు. కానీ ఆ పచ్చని మొక్కలు వాడిపోతుంటే తట్టుకోలేరు. అలాంటివారి కోసమే ఈ టిప్స్. ఇంట్లో వాడిపోయిన మొక్కలను మళ్లీ పచ్చని చిగురులతో చూడాలని అందరికీ ఉంటుంది. అయితే సరైన పద్ధతులు పాటిస్తే, మీ మొక్కలను మళ్ళీ పచ్చని ఆకులతో, ఆరోగ్యంగా చూడొచ్చు. ఇంట్లో వాడిపోయిన మొక్కలను బతికించుకోవడానికి కొన్ని చిట్కాలు ఉన్నాయి. అవేంటో ఇప్పుడు తెలుసుకుందాం.
చిట్కా 1
సరైన మోతాదులో నీరు అవసరం
మొక్కలకు సరైన మోతాదులో నీరు పోస్తే అవి ఆరోగ్యంగా ఉంటాయి. నీరు ఎక్కువ మోతాదులో పోసినా వాటికి ముప్పేనని గ్రహించాలి.
నీరు ఎంత కావాలో తెలుసుకోవడానికి, మట్టిలో ఒక అంగుళం లోతుకు గుచ్చి చూడండి.
పొడిగా అనిపిస్తే, నీరు పోయడానికి ఇది సరైన సమయం అని గ్రహించాలి. ఒకవేళ అది ఇంకా తడిగా ఉంటే, ఇంకొంచెం ఆరే వరకు నీరు పోయకుండా ఉండాలి.
ఇలా చేయడం వల్ల వేర్లు కుళ్ళిపోకుండా చేయొచ్చు. ఈ పద్ధతి మొక్కకు సరిపడా నీరు అందేలా చేస్తుంది.
చిట్కా 2
మొక్కకు వెలుతురు అవసరం
మొక్కల ఆరోగ్యానికి వెలుతురు చాలా ముఖ్యం అని గ్రహించాలి.
మీ మొక్కకు సరైన సూర్యరశ్మి అందేలా చూడాలి.
అందుకోసం దానిని సూర్యరశ్మి అందే ప్రాంతంలో ఉంచండి.
కొన్ని మొక్కలు సూర్యరశ్మిలో ఎక్కువగా ఉండటం వల్ల అవి బాగా పెరుగుతాయి. మరికొన్నింటికి వెలుతురు అవసరం ఉండకపోవచ్చు.
కొన్ని మొక్కలకు నీడ అవసరం ఉంటుంది.
మీ మొక్కకు సరైన వెలుతురు అందేలా చేయడం వల్ల అది మళ్లీ ఆరోగ్యంగా మారుతుంది.
చిట్కా 3
తేమ ఎంతో ముఖ్యం
మొక్కల ఆరోగ్యానికి తేమ చాలా ముఖ్యం. ముఖ్యంగా ఎండ తీవ్రత ఉన్న ప్రాంతాల్లోని మొక్కలకు ఎక్కువ తేమ అవసరం ఉంటుంది.
మీ మొక్కల చుట్టూ తేమను ఉండేలా చేయాలి. అందుకోసం మీరు మొక్క పక్కనే ఒక నీటి పళ్లెం పెట్టొచ్చు.
దాని వల్ల నీటి ఆవిరి, తేమ అనేది ఆ మొక్కకు అందుతూ ఉంటుంది.
లేదంటే మొక్కలపై అప్పుడప్పుడు నీటి తుంపరలు చల్లుతూ ఉండటం కూడా ఉత్తమమైన పద్దతి అని చెప్పొచ్చు.
చిట్కా 4
పాడైన ఆకులతో డేంజర్
ఆకులు కుళ్లిపోయినా లేదా పాడైనా వాటిని వెంటనే కత్తిరించడం చాలా మంచిది. దానివల్ల మొక్కను కాపాడటమే కాకుండా అది అందంగా కనిపించేలా చేయొచ్చు.
పాడైన ఆకులను కత్తిరించడం వల్ల కొత్త ఆకులు వచ్చే అవకాశం కూడా ఉంటుంది.
ఆకులను కత్తిరించడానికి శుభ్రమైన కత్తెర వాడటం మంచిది. దానివల్ల నష్టం తగ్గుతుంది.
క్రమం తప్పకుండా ఆకులను కత్తిరిస్తూ ఉంటే మొక్క కూడా కొత్త చిగురులతో అందంగా మారుతుంది.
చిట్కా 5
ఎరువులు వాడటం ముఖ్యం
మొక్కకు నీరు, వెలుతురు సరిగా అందేలా చూసిన తర్వాత ఎరువులు కూడా వేయండి.
ఎరువులు సరైన విధంగా వాడితే మొక్క బలంగా ఆరోగ్యంగా పెరుగుతుంది.
ఎక్కువగా ఎరువులు వేయడం మానుకోండి. దానివల్ల మొక్కకు మరింత ఇబ్బంది కలిగే అవకాశం ఉంది.