
యోగా ప్రాక్టీసు మొదలు పెట్టే వారు ఎలాంటి పొరపాట్లు చేయకూడదో తెలుసుకోండి
ఈ వార్తాకథనం ఏంటి
భారతదేశంలో పుట్టిన యోగా, ప్రప్రంచమంతటా విస్తరించింది. యోగా చేయడం వల్ల ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలున్నాయి.
ఆ ప్రయోజనాలను మీరు పొందాలనుకుంటే ఈరోజు నుండే యోగా ప్రాక్టీసు మొదలెట్టండి. ఇక్కడ ఒక విషయం గుర్తుంచుకోవాలి.
యోగా ప్రాక్టీసు చేసేటపుడు కొన్ని విషయాల్లో పొరపాట్లు చేస్తారు. అవేంటో ఇక్కడ తెలుసుకుందాం.
పోలికలు వద్దు:
మీరు యోగా చేయడం ఈ మధ్యనే మొదలు పెట్టారు కాబట్టి, ఆల్రెడీ ఎన్నో రోజుల నుండి చేస్తున్నవారు మీకంటే బాగా ఆసనాలు వేయగలరు.
వాళ్ళను చూసి నేనలా చేయలేకపోతున్నానే అని ఆలోచించకండి. దేనికైనా టైమ్ పడుతుందని గుర్తించండి.
వాళ్ళను చూసి మీరు శరీరాన్ని ఇష్టం వచ్చినట్టుగా వంచితే అనవసరంగా ఇబ్బంది కలుగుతుంది.
Details
యోగా మొదలెట్టే ముందు శరీరాన్ని వేడి చేయాలి
స్థిరత్వం లేకపోవడం:
యోగా స్టార్ట్ చేసిన కొత్తలో ఆసనాలు చేయడం వీలుకాకపోవడం వల్ల యోగా మీద ఆసక్తి తగ్గిపోతుంది.
కొందరు ఒకరోజు చేస్తారు, ఇంకోరోజు చేయరు. ఈ అస్థిరత్వం వల్ల ఆసక్తి తగ్గుతుంది.
వార్మప్ చేయకపోవడం:
ఏ వ్యాయామం చేసే ముందైనా శరీరాన్ని వార్మప్ చేయడం ఖచ్చితంగా అవసరం. యోగా మొదలెట్టే ముందు వార్మప్ చేయాల్సిందే. వార్మప్ చేయకపోతే శరీరం తేలికగా మారదు. దానివల్ల కండరాలు పట్టేయడం వంటి సమస్యలు వస్తాయి.
కూల్ డౌన్ వ్యాయామాలు చేయకపోవడం:
యోగా చేసే ముందు శరీరాన్ని వార్మప్ ఎలా చేసుకుంటామో, యోగా పూర్తయ్యాక బాడీని కూల్ డౌన్ అలా చేయాలి. దీనివల్ల శరీరం చల్లబడి అలసట, నొప్పులు తగ్గుతాయి.