Food: ఐదేళ్ళ లోపు పిల్లలు తినకూడని ఆహరాలు తెలుసుకోండి.
ఐదేళ్ల లోపు పిల్లలకు పోషకాహారం తప్పకుండా అందించాలి. పిల్లలు ఎదగడానికి సరైన ఆహారం అందించడం చాలా ముఖ్యం. పోషకాహారంలో ఏదైనా లోటు ఏర్పడితే పిల్లల ఎదుగుదలలో లోటు కనిపిస్తుంది. అందుకే ఆహారం విషయంలో చాలా జాగ్రత్తగా ఉండాలి. ప్రస్తుతం ఐదేళ్లలోపు పిల్లలు ఎలాంటి ఆహారాలు తీసుకోకూడదో ఇక్కడ తెలుసుకుందాం. చక్కెర పదార్థాలు: పిల్లలకు చాక్లెట్లు అంటే చాలా ఇష్టం. అయితే వాటిల్లో కృత్రిమ తీపి కారకాలైన ఆస్పర్టెన్, సుక్రలోజ్, శాకరిన్ వంటివి ఉంటాయి. దీనివల్ల మంచి కంటే చెడు ఎక్కువగా జరుగుతుంది. అమాంతం బరువు పెరిగిపోతారు. అలాగే దంతాల సమస్యలు వస్తాయి. అందుకే చాక్లెట్లు, ఐస్ క్రీమ్, జెల్లీ మొదలగు వాటిని పిల్లలు తినకూడదు.
సాఫ్ట్ డ్రింక్స్ అసలే వద్దు
రిఫైన్ ఆయిల్: ఆయిల్ ని అధిక ఉష్ణోగ్రత వద్ద వేడి చేయడం వల్ల దానిలోని పోషకాలు తొలగిపోతాయి. ఇలాంటి ఆయిల్స్ తీసుకోవడం వల్ల పిల్లల్లో కొవ్వు పెరుగుతుంది. కెఫిన్: కెఫిన్ వల్ల పిల్లల్లో నిద్ర సంబంధ సమస్యలు వస్తాయి. ఫోకస్ తగ్గిపోతుంది. ఇంకా యాంగ్జయిటీ, మానసిక అనారోగ్య సమస్యలు పెరిగే అవకాశం ఉంది. కాబట్టి కెఫిన్ పదార్థాలకు మీ పిల్లల్ని దూరంగా ఉంచండి. సాఫ్ట్ డ్రింక్స్: సోడా ఇంకా ఇతర సాఫ్ట్ డ్రింక్స్ ని పిల్లలకు అందివ్వకపోవడమే మంచిది. ఈ డ్రింక్స్ లో చక్కెర శాతం ఎక్కువగా ఉంటుంది. అంతేకాదు దీని వల్ల దంతాల సమస్యలు, ఎముకల సమస్యలు, ఎలర్జీ, ఊబకాయం, తలనొప్పి వంటి సమస్యలు వస్తాయి.