LOADING...
Motivation: ఆఫీసులో ఈ నలుగురు వ్యక్తులతో జాగ్రత్త అవసరం.. గుడ్డిగా నమ్మితే సమస్యలు
ఆఫీసులో ఈ నలుగురు వ్యక్తులతో జాగ్రత్త అవసరం.. గుడ్డిగా నమ్మితే సమస్యలు

Motivation: ఆఫీసులో ఈ నలుగురు వ్యక్తులతో జాగ్రత్త అవసరం.. గుడ్డిగా నమ్మితే సమస్యలు

వ్రాసిన వారు Jayachandra Akuri
Nov 23, 2025
01:24 pm

ఈ వార్తాకథనం ఏంటి

గొప్ప తత్త్వవేత్త ఆచార్య చాణక్యుడు రూపొందించిన చాణక్య నీతి నేటి కార్పొరేట్ ప్రపంచంలోనూ ఒక విలువైన మార్గదర్శకంగా నిలుస్తోంది. ఆఫీసులోని రాజకీయాలు, తోటి ఉద్యోగుల నిజ స్వభావం, మోసాలను గుర్తించడం వంటి అంశాలను చాణక్యుడు వివరించాడు. ముఖ్యంగా అవకాశవాదులు ఎక్కువగా ఉండే ప్రస్తుత ఆఫీస్ వాతావరణంలో, చాణక్యుని చిట్కాలు ఎంతో ఉపయోగకరంగా ఉంటాయి. నేటి కార్పొరేట్ ప్రపంచంలో స్నేహితులు లేదా శత్రువులు ఉండవు. అందరూ అవకాశవాదులే. మన చుట్టూ ఉన్న వ్యక్తుల నిజాయితీని అనుమానించడం సర్వసాధారణం. పైకి నవ్వుతూ కనిపించే వ్యక్తుల వెనుక దాగి ఉన్న స్వార్థపూరిత ఆలోచనలను గుర్తించడానికి చాణక్యుడు కొన్ని ముఖ్య సూత్రాలను వివరించారు.

Details

ఇతరుల ముందు మీ గురించి తప్పుగా మాట్లాడే అవకాశం

ఒక వ్యక్తి మాటల ద్వారా సులభంగా మోసం చేయవచ్చు, కానీ వారి చర్యలు వారి నిజమైన స్వభావాన్ని వెల్లడిస్తాయి. కష్ట సమయాల్లో ముఖం దాచుకునే స్నేహితుడు, ప్రేమ గురించి ఎక్కువ మాట్లాడి పట్టించుకోని జీవిత భాగస్వామి, మన ముందు ప్రశంసించి వెనుక క్రెడిట్ తీసుకునే ఆఫీసు సహోద్యోగి—వారి నిజ స్వభావం వారి ప్రవర్తన ద్వారా కనిపిస్తుంది. మీ బాస్ లేదా తోటి ఉద్యోగుల గురించి చెడుగా మాట్లాడే వ్యక్తులు, ఖచ్చితంగా ఇతరుల ముందు కూడా మీ గురించి చెడుగా చెప్పే అవకాశం ఉంది. ఇలాంటి వ్యక్తులు నాటకాలు ఆడతారు, కాబట్టి ఇతరుల వ్యక్తిగత విషయాలను పంచుకునే బదులు, కెరీర్, కొత్త ఆలోచనల గురించి మాట్లాడే వారితో స్నేహం చేయడం ఉత్తమం.

Details

తక్కువగా మాట్లాడాలి

తమ చుట్టూ ఉన్నవారిని నిశ్శబ్దంగా గమనించేవారే అత్యంత తెలివైనవారు, శక్తివంతులు. ఎక్కువగా మాట్లాడే వ్యక్తి తన బలహీనతలను అనవసరంగా బయటపెడతాడు. మౌనంగా ఉండే వ్యక్తి ప్రతిదీ వింటాడు, నేర్చుకుంటాడు, విశ్లేషిస్తాడు. మనం తక్కువగా మాట్లాడి ఇతరులకు ఎక్కువ అవకాశాలు ఇస్తే, వారు తెలియకుండానే అనేక విషయాలను బయటపెడతారు. ఇది అత్యంత శక్తివంతమైన ఆఫీస్ టెక్నిక్‌లలో ఒకటి. నిజమైన చిరునవ్వు ముఖం అంతటా, ముఖ్యంగా కళ్ళలో కనిపిస్తుంది. పైపైన నవ్వు కేవలం పెదవులకే పరిమితం అవుతుంది. చాణక్యుని ప్రకారం, ఇతరుల ఇబ్బందులను చూసి నవ్వేవారు లేదా వారి నిస్సహాయతను తమ స్వార్థానికి ఉపయోగించే వ్యక్తుల పట్ల ఎల్లప్పుడూ జాగ్రత్తగా ఉండాలి.