LOADING...
Summer Tips: సమ్మర్ హీట్‌కు చెక్.. ఈ కూల్ ప్లేస్‌లకు వెళ్లితే ఫుల్ రిలాక్స్!
సమ్మర్ హీట్‌కు చెక్.. ఈ కూల్ ప్లేస్‌లకు వెళ్లితే ఫుల్ రిలాక్స్!

Summer Tips: సమ్మర్ హీట్‌కు చెక్.. ఈ కూల్ ప్లేస్‌లకు వెళ్లితే ఫుల్ రిలాక్స్!

వ్రాసిన వారు Jayachandra Akuri
Mar 22, 2026
01:03 pm

ఈ వార్తాకథనం ఏంటి

వేసవి కాలం సమీపిస్తున్న వేళ చాలా మంది మండే ఉష్ణోగ్రతల నుంచి ఉపశమనం పొందేందుకు చల్లని ప్రదేశాలకు టూర్ ప్లాన్ చేస్తున్నారు. ఇంట్లో ఏసీకి పరిమితమవకుండా, ప్రకృతి ఒడిలో సేదతీరాలని భావించే వారికి దేశంలోనే కొన్ని అద్భుతమైన గమ్యస్థానాలు అందుబాటులో ఉన్నాయి. సమ్మర్‌లో తప్పక సందర్శించాల్సిన అలాంటి ప్రదేశాలు ఇవే: మున్నార్ దక్షిణ భారతదేశంలో అత్యంత అందమైన హిల్ స్టేషన్లలో మున్నార్ ఒకటి. ఇక్కడి వాతావరణం ఎప్పుడూ చల్లగా ఉంటుంది. విస్తారంగా కనిపించే టీ తోటలు, పచ్చని కొండలు, కాఫీ తోటలు, మేఘాల మధ్య విహరించే దృశ్యాలు పర్యాటకులను మంత్రముగ్ధులను చేస్తాయి. ప్రశాంత వాతావరణం కోరుకునే వారికి ఇది సరైన గమ్యం.

వివరాలు

కిన్నౌర్

హిమాచల్ ప్రదేశ్‌లోని కిన్నౌర్ మంచుతో కప్పబడిన పర్వతాలు, దట్టమైన అడవులు, అందమైన సరస్సులు, లోయలతో ప్రసిద్ధి. చల్లటి వాతావరణంతో పాటు ప్రకృతి సోయగాలు ఇక్కడ ప్రత్యేక ఆకర్షణ. స్థానిక సంస్కృతి కూడా పర్యాటకులను ఆకట్టుకుంటుంది. ప్రశాంతంగా ప్రకృతిని ఆస్వాదించాలనుకునే వారికి ఇది ఉత్తమ ఎంపిక. గుల్మార్గ్ సాహసప్రియులకు గుల్మార్గ్ నిజంగా స్వర్గధామం. ట్రెక్కింగ్ వంటి యాక్టివిటీలతో పాటు అద్భుతమైన ప్రకృతి దృశ్యాలు ఇక్కడ ప్రత్యేక ఆకర్షణ. వేసవిలో కూడా చల్లటి వాతావరణం ఉండటంతో ఇది బెస్ట్ సమ్మర్ డెస్టినేషన్‌గా నిలుస్తుంది.

వివరాలు

డార్జిలింగ్

పశ్చిమ బెంగాల్‌లోని డార్జిలింగ్ తన టీ తోటలు, పర్వత రైళ్లు, లోయలు, ఎత్తైన కొండలతో ప్రసిద్ధి. ముఖ్యంగా టైగర్ హిల్ నుంచి కనిపించే సూర్యోదయం అద్భుతంగా ఉంటుంది. స్వచ్ఛమైన గాలి, చల్లటి వాతావరణంలో విశ్రాంతి తీసుకోవాలనుకునే వారికి ఇది ఆదర్శ ప్రదేశం. ఊటీ & కోడైకనాల్ తమిళనాడులోని ఊటీ, కొడైకెనాల్ ప్రకృతి అందాలకు ప్రసిద్ధి. పచ్చని తోటలు, పర్వతాలు, చల్లటి వాతావరణం ఈ ప్రాంతాలను ప్రత్యేకంగా నిలబెడతాయి. వేసవిలో కూడా ఇక్కడ చల్లదనం అనుభవించవచ్చు. మొత్తంగా మండే ఎండల నుంచి తప్పించుకుని ప్రకృతి మధ్యలో సేదతీరాలని అనుకునే వారికి ఈ ప్రదేశాలు అద్భుతమైన ఎంపికలు.

Advertisement