ఇమ్యూనిటీని పెంచడం నుండి జీర్ణశక్తిని మెరుగుపర్చే వరకు తులసి నీళ్ళ ప్రయోజనాలు
భారతదేశంలో తులసి చెట్టు ప్రతీ ఒక్కరి ఇంటిలో ఉంటుంది. తులసి మొక్క వల్ల ఆరోగ్యానికి ఎన్నో రకాల ప్రయోజనాలు ఉన్నాయి. రోజూ తులసి నీరును తాగడం వల్ల శరీరానికి మంచి ఆరోగ్యం అందుతుంది. ఇమ్యూనిటీని పెంచడం నుంచి జీర్ణశక్తిని మెరుగుపరిచే వరకు తులసి నీరు తాగడం వల్ల కలిగే ఆరోగ్య ప్రయోజనాలను ఇప్పుడు తెలుసుకుందాం. జీర్ణశక్తిని మెరుగుపరిచే తులసినీరు: తులసి నీటిని తాగడం వల్ల గ్యాస్, ఉబ్బరం వంటి సమస్యలు తొలగిపోతాయి. అంతేకాదు ఆహారం త్వరగా జీర్ణం అవుతుంది. ఒత్తిడిని తగ్గిస్తుంది: తులసి నీటిని రోజూ తాగడం వల్ల మానసిక ఒత్తిడి పూర్తిగా తగ్గుతుందని నిపుణులు తెలియజేస్తున్నారు. ప్రశాంతతను, విశ్రాంతిని అందించడంలో తులసినీరు సాయపడుతుంది.
ఇమ్యూనిటీని పెంచుతుంది
తులసి నీటిలో ఉండే పోషకాలు రోగనిరోధక శక్తిని పెంచడంలో సాయపడతాయి. రోగాలను తట్టుకునే శక్తి శరీరానికి తులసి నీరు వల్ల వస్తుంది. నోటి దుర్వాసనను తొలగిస్తుంది: చిగుళ్ళ నుంచి రక్తం కారడం. నోటి దుర్వాసన మొదలగు సమస్యలు ఉన్నవారు రోజూ తులసి నీటిని తాగడం మంచిది. దీనివల్ల చిగుళ్ళు బలంగా మారడమే కాకుండా దుర్వాసన తొలగిపోతుంది. విష పదార్థాలను బయటకు పంపిస్తుంది: శరీరంలోని విష పదార్థాలను బయటకి పంపించడంలో తులసి నీరు సహాయపడుతుంది. తులసి నీటిని ఎలా తాగాలి? రాత్రిపూట ఒక రాగి చెంబులో తులసి ఆకులను వేసి దానిపైన మూత పెట్టి ఉంచాలి. తెల్లారిన తర్వాత ఏ సమయంలోనైనా ఆ నీళ్లను తాగవచ్చు.