
Honey Coated Dry Fruits: తేనెతో డ్రై ఫ్రూట్స్ కలుపుకుతింటే ఆ ప్రయోజనాలే వేరు
ఈ వార్తాకథనం ఏంటి
మనం ఆరోగ్యంగా ఉండాలంటే రోజూ తాజా కూరగాయలు, పండ్లు,డ్రై ఫ్రూట్స్ వంటి ఆహారాలను తీసుకోవాలి.
డ్రై ఫ్రూట్స్ మన ఆరోగ్యంపై అనేక పాజిటివ్ ప్రభావాలు చూపిస్తాయి. వాటిని తేనెలో నంచుకుని తినడం వల్ల ఫలితాలు మరింత అద్భుతంగా మారుతాయి.
తేనెతో కలిపి డ్రై ఫ్రూట్స్ తినడం ద్వారా వచ్చే కొన్ని ప్రయోజనాలు ఇక్కడ ఉన్నాయి.
శరీర ఆరోగ్యానికి బలోపేతం
తేనెలో ఉండే పోషకాలు, డ్రై ఫ్రూట్స్‌లోని సమృద్ధి పోషకాలు కలిశాక, ఇవి ఆరోగ్యాన్ని మరింత పెంచుతాయి.
వివరాలు
బలాన్ని ఇస్తాయి
ఈ రెండు పదార్థాలలో సహజ చక్కెరలు ఉంటాయి. అవి మన శరీరానికి అవసరమైన శక్తిని అందిస్తాయి.
అయితే, డయాబెటిస్ ఉన్న వారు మాత్రం దీనికి దూరంగా ఉండాలి. ఎందుకంటే తేనె శరీరంలో చక్కెర స్థాయిని పెంచుతుంది.
జీర్ణ సమస్యలను తగ్గించడం
జీర్ణ సంబంధిత సమస్యలు ఉన్న వారు, డ్రై ఫ్రూట్స్‌ని తేనెతో కలిపి తీసుకోవడం ద్వారా జీర్ణ వ్యవస్థను మెరుగుపరచుకోవచ్చు.
డైటరీ ఫైబర్ అధికంగా ఉన్నందున, ఇవి అరుగుదలలో సహాయపడతాయి.మల విసర్జన సజావుగా జరగడానికి కృషి చేస్తాయి.
వివరాలు
గుండెకు ఆరోగ్యం
ఎండు ద్రాక్ష, ఆప్రికాట్లు వంటి డ్రై ఫ్రూట్స్‌లో పొటాషియం, ఫైబర్, ఫినోలిక్ సమ్మేళనాలు ఉంటాయి.
వీటిని తేనెతో కలిపి తినడం వల్ల గుండె ఆరోగ్యానికి మేలు జరుగుతుంది.
రక్త వృద్ధి
రక్త హీనత ఉన్న వారు రోజూ ఈ డ్రై ఫ్రూట్స్‌ని తేనెతో తీసుకుంటే, వాటిలోని మినరళ్లు, విటమిన్లు మరియు యాంటీ ఆక్సిడెంట్లు హిమోగ్లోబిన్ పెరగడానికి సహాయపడతాయి.
దీర్ఘకాలిక వ్యాధులను నివారించడం
తేనెలోని యాంటీ బ్యాక్టీరియల్ లక్షణాలు,పోషకాలు కలిగిన డ్రై ఫ్రూట్స్ రోగ నిరోధక శక్తిని పెంచడంలో సహాయపడతాయి. ఇవి శరీరంలో ఫ్రీ రాడికల్స్‌కి వ్యతిరేకంగా పనిచేసి, దీర్ఘకాలిక వ్యాధులను దూరం చేస్తాయి.