Benefits Of Eating An Egg: రోజూ ఉడికించిన గుడ్లు తింటున్నారా.. అయితే,మీ శరీరానికి ఏమి జరుగుతుందో తెలుసా.?
కోడి గుడ్లు ప్రోటీన్ల స్టోర్ హౌస్. వాటిలో విటమిన్లు,ఖనిజాలు కూడా పుష్కలంగా ఉంటాయి. గుడ్లలో విటమిన్ ఎ, బి12, డి,ఇ,కె,ఫోలేట్,ఫాస్పరస్, కాల్షియం,జింక్,ఐరన్,ఆరోగ్యకరమైన కొవ్వులు పుష్కలంగా ఉండటం వల్ల శరీరానికి మేలు చేస్తుంది. రోజుకు రెండు ఉడికించిన గుడ్లు తినడం వల్ల బరువు తగ్గవచ్చని అధ్యయనాలు చెబుతున్నాయి. ఇవి ఆకలిని నియంత్రించడంలో, ఉబ్బరాన్ని తగ్గించడంలో సహాయపడతాయి. గుడ్లలో ఉండే కోలిన్ అనే పోషకం మెదడు అభివృద్ధికి, జ్ఞాపకశక్తిని పెంపొందించడానికి చాలా మంచిది. కాబట్టి పిల్లలకు రోజూ గుడ్లు ఇవ్వడం మంచిది. కోడిగుడ్లు రోజూ తింటే రోగనిరోధక శక్తి పెరుగుతుంది. గుడ్డు సొనలో విటమిన్ డి కూడా ఉంటుంది. ఇవి శరీరం కాల్షియంను గ్రహించేలా చేస్తాయి. కాబట్టి ఎముకల ఆరోగ్యానికి గుడ్లను ఆహారంలో చేర్చుకోవడం మంచిది.
గుడ్లలోని పోషకాల వల్ల మెదడు త్వరగా పదునెక్కుతుంది
విటమిన్ ఎ, జింక్ పుష్కలంగా ఉండే గుడ్లను రెగ్యులర్ గా తీసుకోవడం వల్ల కంటి ఆరోగ్యానికి కూడా మంచిది. సెలీనియం పుష్కలంగా ఉన్న గుడ్లు తినడం చర్మ ఆరోగ్యానికి కూడా మంచిది. గుడ్డులోని తెల్లసొనలో ప్రోటీన్లు,అమినో యాసిడ్స్ పుష్కలంగా ఉంటాయి. ఉడికించిన గుడ్డు ఆరోగ్యానికి చాలా ఉపయోగకరం అని ఆరోగ్య నిపుణులు పదే పదే సూచిస్తున్నారు. గుడ్డును బ్రేక్ ఫాస్ట్ గా తినాలి. దీంతో పొట్ట భారంగా అనిపించదు. ఖాళీ కడుపుతో గుడ్లు తినడం ద్వారా, మీ మెదడు చాలా వేగంగా పనిచేయడం ప్రారంభిస్తుంది. గుడ్లలో కొన్ని పోషకాలు ఉంటాయి.ఇవి మీ మెదడును త్వరగా పదును పెట్టగలవు. గుడ్లలో ఒమేగా 3 ఫ్యాటీ యాసిడ్స్,ఫోలేట్,సెలీనియం,విటమిన్లు ఉంటాయి. ఇవి మెదడుకు చాలా మేలు చేస్తాయి.