
Bharat Ratna : అత్యున్నత పౌర పురస్కారం భారతరత్నకి 70 ఏళ్లు.. ప్రారంభించింది ఎవరో తెలుసా
ఈ వార్తాకథనం ఏంటి
భారతదేశంలో ఏదైనా ఒక రంగంలో విశేషంగా కృషి చేసిన పౌరులకు భారత ప్రభుత్వం భారతరత్నను ప్రదానం చేస్తుంది.
ఈ మేరకు అత్యున్నత స్థాయి పౌర పురస్కారాన్ని 1954 జనవరి 2న భారత తొలి రాష్ట్రపతి డాక్టర్ రాజేంద్ర ప్రసాద్ ప్రారంభించారు.
ఈ 7దశాబ్దాల కాలంలో ఎందరో మేధావులు, రచయితలు, సామాజిక ఉద్యమకారులు, శాస్త్రవేత్తలు, పారిశ్రామికవేత్తలు, కళాకారులు, రచయితలు, రాజకీయ నాయకులు ఈ పురస్కారాన్ని అందుకున్నారు.
కుల, మత, వర్గ, వర్ణ, విద్య తదితర రంగాల్లో విశేషంగా సేవలు అందించిన వారికి ఈ పురస్కారాన్ని అందిస్తారు.
ఇదే సమయంలో పద్మ అవార్డులకు కాస్త భిన్నంగా భారతరత్న పురస్కారానికి ఎంపిక జరుగుతుంది. భారతరత్న పురస్కారానికి అర్హులైన వక్తులను ప్రధానమంత్రే నేరుగా రాష్ట్రపతికి సిఫార్సు చేస్తారు.
details
భారతరత్నకు 7వ స్థాయి గౌరవం
ఏడాదిలో గరిష్టంగా ముగ్గురికి మాత్రమే దీన్ని అందిస్తారు.భారతరత్న పౌరులకు 7వస్థాయి గౌరవం లభిస్తుంది.
తొలి 6 స్థానాల ప్రోటోకాల్ వీరివే...
రాష్ట్రపతి,ఉపరాష్ట్రపతి,ప్రధాన మంత్రి,గవర్నర్, మాజీ రాష్ట్రపతులు,ఉపప్రధాని,భారత ప్రధాన న్యాయమూర్తి
ఈ క్రమంలోనే పురస్కార గ్రహీతలకు సర్టిఫికెట్,రావి ఆకులను పోలిన పతకాన్ని రాష్ట్రపతి అందజేస్తారు.
ప్లాటినంతో చెక్కిన సూర్యుడి ముద్ర ఒకవైపు, కింద హిందీలో భారతరత్న అని కనిపిస్తుంది. పతకం అంచుల్లోనూ ప్లాటినం లైనింగ్'తో తీర్చుదిద్ది ఉంటుంది. రెండో వైపు అశోక స్తంభం ముద్ర ఉంటుంది.
దాని కింద దేవనాగరి లిపిలో 'సత్యమేవ జయతే' అని కనిపిస్తుంటుంది. వీరికి రైల్వేలో ఉచిత ప్రయాణం, జాతీయ, రాష్ట్రంలో జరిగే ప్రభుత్వ కార్యక్రమాలకు ఆహ్వానం, ప్రోటోకాల్ మర్యాద ఉంటాయి.
Details
చివరిసారిగా 2019లో అవార్డు ప్రదానం
అయితే, పేరుకు ముందు 'భారతరత్న' అని బహిరంగంగా రాసుకుని, ప్రదర్శించకూడదు. తమ లెటర్‌హెడ్, విజిటింగ్ కార్డుల్లో ఈ అవార్డు అందుకున్నట్లు రాసుకోవచ్చు. ఇప్పటివరకు 48 మందికి ఈ అవార్డును ప్రదానం చేశారు.
విదేశీయులైన సరిహద్దు గాంధీగా పేరు పొందిన ఖాన్ అబ్దుల్ గఫార్ ఖాన్, నెల్సన్ మండేలా భారతరత్న అందుకున్నారు.
మొరార్జీ దేశాయ్ నేతృత్వంలోని జనతా ప్రభుత్వం ఈ పురస్కారాన్ని నిలిపివేసింది. 2013లో తొలిసారి క్రీడాకారులకు దీన్ని ఇవ్వాలని నిర్ణయించారు. 2014లో క్రికెట్ దిగ్గజం సచిన్ టెండూల్కర్‌కు భారతరత్న పురస్కారాన్ని ప్రదానం చేశారు.
ఇప్పటివరకు 48 మందికి ఈ అవార్డును అందించారు. చివరిసారిగా 2019లో అవార్డును ప్రదానం చేశారు.
Details
1962లో అత్యున్నత పౌర పురస్కారానికి ఎంపికైన డా.రాజేంద్ర ప్రసాద్
1954లో సర్వేపల్లి రాధాకృష్ణన్, చక్రవర్తుల రాజగోపాలాచారి, డా.సి.వి.రామన్,
1955లో డా. భగవాన్ దాస్, డా. మోక్షగుండం విశ్వేశ్వరయ్య, జవహర్ లాల్ నెహ్రూ,
1957లో గోవింద్ వల్లభ్ పంత్,
1958లో ధొండొ కేశవ కార్వే,
1961లో డా. బీ.సీ.రాయ్, పురుషోత్తమ దాస్ టాండన్,
1962లో డా. రాజేంద్ర ప్రసాద్,
1963లో డా. జాకీర్ హుస్సేన్, పాండురంగ వామన్ కానే,
1966లో లాల్ బహదూర్ శాస్త్రి (మరణానంతరం),
1971లో ఇందిరాగాంధీ,
1975లో వీ.వీ.గిరి,
1976లో కామరాజ్ నాడార్ (మరణానంతరం),
1980లో మదర్ థెరీసా,
1983లో ఆచార్య వినోబా భావే (మరణానంతరం),
1987లో ఖాన్ అబ్దుల్ గఫార్ ఖాన్,
1988లో ఎంజీ రామచంద్రన్ (మరణానంతరం),
1990లో బి.ఆర్.అంబేద్కర్ (మరణానంతరం), నెల్సన్ మండేలా,
details
మరణానంతరం ఎవరెవరికంటే..
1991లో రాజీవ్ గాంధీ (మరణానంతరం), సర్దార్ వల్లభాయి పటేల్ (మరణానంతరం), మొరార్జీ దేశాయి,
1992లో మౌలానా అబుల్ కలామ్ ఆజాద్ (మరణానంతరం), జే.ఆర్.డీ.టాటా, సత్యజిత్ రే,
1997లో ఏ.పి.జె.అబ్దుల్ కలాం, గుర్జారీలాల్ నందా, అరుణా అసఫ్ అలీ (మరణానంతరం),
1998లో ఎం.ఎస్.సుబ్బులక్ష్మి, సి.సుబ్రమణ్యం, జయప్రకాశ్ నారాయణ్,
1999లో రవి శంకర్, అమర్త్య సేన్, గోపీనాథ్ బొర్దొలాయి,
2001లో లతా మంగేష్కర్, బిస్మిల్లా ఖాన్,
2008లో భీమ్ సేన్ జోషి,
2014లో సచిన్ టెండూల్కర్, సి.ఎన్.ఆర్.రావు,
2015లో మదన్ మోహన్ మాలవ్యా, అటల్ బిహారీ వాజపేయి,
2019లో నానాజీ దేశ్‌ముఖ్ (మరణానంతరం), కళాకారుడు డాక్టర్ భూపేన్ హజారికా (మరణానంతరం), మాజీ రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీలకు ఈ అవార్డును ప్రదానం చేశారు.