Seeds Bosst Immunity : చలికాలంలో ఈ 6 గింజలు మీ జలుబును తగ్గిస్తాయ్
ఓవైపు చలికాలం జోరుగా కొనసాగుతున్నందున చలిపులికి ప్రజలు బెంబెలెత్తిపోతున్నారు. మరోవైపు కరోనా కేసులు సైతం విజృంభిస్తున్నాయి. ఈ మేరకు దేశవ్యాప్తంగా ఆందోళన కలిగిస్తోంది. మీ రోగనిరోధక శక్తిని పెంచేందుకు పలు ఆహారాలను తప్పక భోజనంగా చేర్చుకోవాల్సిందే. చియా విత్తనాలు బరువును అదుపులో ఉంచుతాయి.పైగా ఆరోగ్యానికి చాలా రకాలుగా ఉపయోగపడతాయి. చియా విత్తనాల్లో థయామిన్, మాంగనీస్, ఐరన్, మెగ్నీషియం, కాల్షియం, జింక్, ఫాస్పరస్ విటమిన్లు ఉంటాయి. ఈ విత్తనాలను ఆహారంలో చేర్చుకోవడంతో జీవక్రియను పెంచడమే కాదు జీర్ణక్రియను మెరుగుపరుస్తుంది. ఈ మేరకు రోగనిరోధక శక్తి సైతం పెరుగుతుంది. పాలు, స్మూతీస్ వంటి అనేక వాటితో మిక్స్ చేసి చియా సీడ్స్ తాగవచ్చు.
వాతావరణం చల్లగా ఉంటే ఆ గింజలు తింటే సరి
ఇక నువ్వులు రుచిగా ఉండటమే కాదు అనేక విధాలుగా ఆరోగ్య ప్రయోజనాలున్నాయి.నువ్వుల హల్వా, నువ్వుల లడూ వంటి వంటకాలను తయారు చేసుకోవచ్చు. జలుబు లక్షణాల్లో నువ్వులు తింటే రోగనిరోధక శక్తి పెరిగడం,జీర్ణవ్యవస్థ మెరుగుపడటం లాంటివి కలుగుతాయి. పుచ్చకాయ గింజల్లో జింక్, పొటాషియం,రాగి ఇతర సూక్ష్మపోషకాలు ేఉంటాయి. ఈ గింజలను అల్పాహారంగా తీసుకోవచ్చు.వీటి గింజలను పొడిగా తినవచ్చు. ఫలితంగా రోగనిరోధక శక్తి సైతం పెరుగుతుంది. చల్లని వాతావరణంలో పొద్దుతిరుగుడు విత్తనాలు ఉత్తమం. ఔషధగుణాలతో నిండి ఉన్న ఈ విత్తనాన్ని తీసుకుంటే రోగ నిరోధక శక్తి పెరుగుతుంది. అవిసె గింజల్లో పుష్కలమైన ఫైబర్ ఉంటుంది.ఇది కడుపుని శుభ్రంగా ఉంచడం, జీర్ణవ్యవస్థకు మేలు చేయడం చేస్తుంటాయి. సలాడ్లు, స్మూతీలు, లడ్డూ వంటి వంటకాలను అవిసె గింజలతో చేసుకోవచ్చు.