LOADING...
Prabhas : ప్రభాస్ చేతిలో మరో కొత్త సీక్వెల్!
ప్రభాస్ చేతిలో మరో కొత్త సీక్వెల్!

Prabhas : ప్రభాస్ చేతిలో మరో కొత్త సీక్వెల్!

వ్రాసిన వారు Jayachandra Akuri
Oct 25, 2025
04:18 pm

ఈ వార్తాకథనం ఏంటి

పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ హీరోగా నటిస్తున్న 'ది రాజా సాబ్' త్వరలో ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. ప్రస్తుతం ప్రభాస్ 'ఫౌజీ' సినిమా షూటింగ్‌లో ఫుల్ బిజీగా ఉన్నారు. ఆ తర్వాతే స్పిరిట్ మూవీ షూటింగ్ ప్రారంభం కానుంది. వీటి తర్వాత ఆయనకు ఇప్పటికేకల్కి-2, సలార్-2 ఉన్నాయి. కానీ ప్రభాస్ మరో సీక్వెల్ కోసం కూడా రెడీ అవుతున్నారు. అదే 'ది రాజాసాబ్-2'. ప్రస్తుతం ది రాజాసాబ్ సినిమా షూటింగ్ దాదాపు పూర్తియైంది. ఈ సినిమా జనవరి 9న రిలీజ్ కావడం జరుగనుంది. ఇప్పటికే నిర్మాత టీజీ విశ్వ ప్రసాద్ గతంలో స్పష్టంగా తెలియజేశారు, ఈ సినిమాకు సీక్వెల్ ఉండబోతుందని. అయితే అప్పటికి డైరెక్టర్, హీరో నుండి ఎలాంటి అధికారిక స్పందన రాలేదు.

Details

ప్రభాస్ ఒప్పుకున్నట్లు సమాచారం

తాజాగా మారుతి రాజాసాబ్-2 స్టోరీ లైన్‌ను ప్రభాస్‌కి వివరించగా, ప్రభాస్ వెంటనే ఒప్పుకున్నారని సమాచారం. 'కథ చాలా బాగుంది, చేద్దాం డార్లింగ్' అని ఆయన అన్నారు. కానీ ప్రస్తుతం ప్రభాస్ చేతిలో నాలుగు భారీ ప్రాజెక్టులు ఉన్నారు. వీటన్నిటి తర్వాతే ది రాజాసాబ్-2 షూటింగ్ ప్రారంభం అవుతుంది. ప్రస్తుతం 'ఫౌజీ' షూటింగ్ స్పీడ్‌లో కొనసాగుతోంది, డిసెంబర్‌లో స్పిరిట్ షూటింగ్ స్టార్ట్ కానుంది. ఆ తర్వాత కల్కి-2, సలార్ ప్రాజెక్టులు ఉన్నాయి. ఇవన్నీ పూర్తి అయ్యేందుకు కనీసం మరో రెండు-మూడు సంవత్సరాలు పడతాయి. అందువల్ల ది రాజాసాబ్-2 కోసం అభిమానులు ఇంకా మూడేళ్ల వరకు వేచి ఉండాల్సి ఉంటుంది.