LOADING...
Sajja Biscuits : సజ్జలతో బిస్కెట్స్‌.. చలికాలానికి బెస్ట్ హెల్తీ స్నాక్ 
సజ్జలతో బిస్కెట్స్‌.. చలికాలానికి బెస్ట్ హెల్తీ స్నాక్

Sajja Biscuits : సజ్జలతో బిస్కెట్స్‌.. చలికాలానికి బెస్ట్ హెల్తీ స్నాక్ 

వ్రాసిన వారు Jayachandra Akuri
Dec 15, 2025
12:44 pm

ఈ వార్తాకథనం ఏంటి

రుచికరంగానే కాదు, ఆరోగ్యానికి ఎంతో మేలు చేసే ఆహారాల్లో మిల్లెట్స్‌ ముందువరుసలో ఉంటాయి. అందుకే చిరుధాన్యాలను అస్సలు నిర్లక్ష్యం చేయొద్దని నిపుణులు సూచిస్తున్నారు. అయితే వండే విధానం తెలియక చాలా మంది ఇంట్లో మిల్లెట్స్‌కు చోటు ఇవ్వడం లేదు. కానీ వీటిని స్నాక్స్‌లా తయారు చేస్తే మాత్రం ఒక్క ముక్క కూడా మిగలకుండా ఆస్వాదిస్తారు. సజ్జల్లో అధికంగా ఫైబర్ ఉంటుంది. ఐరన్, జింక్ వంటి ముఖ్యమైన మినరల్స్ సమృద్ధిగా లభిస్తాయి. చలికాలంలో శరీరానికి అవసరమైన పోషకాలను అందించడంలో ఇవి కీలక పాత్ర పోషిస్తాయి. చర్మ ఆరోగ్యానికి మద్దతు ఇస్తాయి. ఇమ్యూనిటీని పెంచుతాయి. ఇంకా ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నందున ఈ రెసిపీని తప్పకుండా ట్రై చేయాలి

Details

సజ్జల బిస్కెట్స్ తయారీకి కావాల్సిన పదార్థాలు

సజ్జ పిండి: 2 కప్పులు బెల్లం: 1 కప్పు నువ్వులు: అర కప్పు నీళ్లు, నెయ్యి: అవసరమైనంత

Details

తయారీ విధానం

ముందుగా బెల్లంలో తగినంత నీళ్లు పోసి కొద్దిగా చిక్కబడే వరకు మరిగించాలి. ఒక గిన్నెలో సజ్జ పిండి, నువ్వులు వేసి బాగా కలపాలి. అందులో బెల్లం నీటిని కొద్దికొద్దిగా పోస్తూ ముద్దలా కలపాలి. తరువాత నెయ్యి పూసిన బటర్ పేపర్‌పై ఈ ముద్దను పెట్టి చపాతీలా ఒత్తాలి. గ్లాసుతో గుండ్రంగా అచ్చులు కట్ చేయాలి. మిగిలిన అంచులను తీసేసి బిస్కెట్లపై ఫోర్క్‌తో గాట్లు పెట్టి, పైపైగా నువ్వులు అద్దాలి. పాన్‌లో నూనె వేడి చేసి ఈ బిస్కెట్లను వేసి బంగారు రంగు వచ్చే వరకు వేగించాలి. చల్లారిన తర్వాత తింటే తినే కొద్దీ తినాలనిపించేలా రుచిగా ఉంటాయి. ఆరోగ్యం, రుచి రెండూ కావాలంటే ఈ సజ్జల బిస్కెట్స్ తప్పకుండా ట్రై చేయండి.

Advertisement