
Bottle Gourd Leaves Benefits: సోరకాయ ఆకులతో ఎన్నో ఆరోగ్యకరమైన ప్రయోజనాలు
ఈ వార్తాకథనం ఏంటి
సహజంగా ఎముకలు బలహీనపడటానికి అనేక రకమైన కారణాలుంటాయి. ముఖ్యంగా వయస్సు పెరగడం, కాల్షియం, ఖనిజాల లోపం, నిశ్చల జీవన శైలి, పోగాకు, ఆల్కహాల్ వినియోం, ఊబకాయం మొదలైన సమస్య కారణంగా చిన్న వయస్సులోనే ఎముకలు బలహీనపడతాయి.
ఈ సమస్యను నివారించేందుకు సొరకాయ ఆకులు తింటే చాలా ప్రయోజనాలు ఉంటాయని నిపుణులు చెబుతున్నారు.
అనేక రాష్ట్రాల్లో సొరకాయ ఆకులను ఉడికించి ఆహారంగా ఉపయోగిస్తారు. వీటిలో విటమన్లు, ఫైబర్, పిండి పదార్థాలు, కాల్షియం, భాస్వరంలాంటివి లభించనున్నాయి.
ఈ కురగాయ ఆకులకు క్రమం తప్పకుండా తింటే అనేక వ్యాధులు దరి చేరే అవకాశం ఉండదు.
Details
కొలస్ట్రాల్, బీపీని సొరకాల ఆకులు నిర్మూలిస్తాయి
సొరకాయ ఆకుల్లో కాల్షియం పుష్కలంగా లభించడం వల్ల ఎముకలు బలంగా మారుతాయి. ముఖ్యంగా కండరాల అభివృద్ధికి కూడా సాయపడుతుంది.
ఈ ఆకుల్లో తగినంత మొత్తంలో కాల్షియం, ఫాస్పరస్ ఉన్నాయి. బ్లడ్ షుగర్ రోగులకు సొరకాయ ఆకులు ఎంతగానో ఉపయోగపడనున్నాయి.
తక్కువ కేలరీలు కలిగిన ఈ ఆకులను మధుమేహ వ్యాధిగ్రస్తులను తీసుకోవడం చాలా మంచిది. అదే విధంగా బరువు పెరిగితే బరువు తగ్గడానికి ఈ సొరకాయ ఆకులను తీసుకోవడం అలవాటు చేసుకోవాలి.
ఇందులో ఉండే పీచు పదార్థం ఎక్కువ కాలం కడుపు నిండుగా ఉంచుతుంది. ఇది కొలస్ట్రాల్, బీపీని కూడా నియంత్రిస్తుంది. మూత్రాశయ ఇన్‌ఫెక్షన్ సమస్యలతో బాధపడేవారు రోజూ సొరకాయ జ్యూస్‌ను తాగినా కూడా ఫలితం ఉంటుంది.