Raju Kalakar: గచ్చు పలకలతో సంగీతం.. చిన్నారి ప్రతిభకు నెట్‌లో భారీ స్పందన
ఈ వార్తాకథనం ఏంటి
గుజరాత్‌కు చెందిన కళాకారుడు రాజు కళాకార్ రెండు గచ్చు పలకలతో సంగీతాన్ని సృష్టిస్తూ పాటలు పాడి వేలాది అభిమానులను సంపాదించుకున్నారు. ఆయన వినూత్న ప్రతిభ సామాజిక మాధ్యమాల్లో విస్తృతంగా ఆదరణ పొందుతోంది. ఈ నేపథ్యంలో మహారాష్ట్రలోని ఛత్రపతి సంభాజీనగర్‌కు చెందిన ప్రియదర్శిని మున్సిపల్ పాఠశాలలో రెండో తరగతి చదువుతున్న దానిష్ షేక్.. రాజు కళాకార్‌కు అభిమానిగా మారాడు. ఆయన వీడియోలను పదేపదే చూస్తూ, అదే తరహాలో రెండు గచ్చు పలకలతో లయబద్ధంగా సంగీతం సృష్టిస్తూ పాటలు పాడటం అభ్యాసం చేశాడు.
వివరాలు
వీడియోకు 50 లక్షలకుపైగా వీక్షణలు
ఫిబ్రవరిలో జరిగిన పాఠశాల వార్షికోత్సవంలో దానిష్ తన ప్రతిభను ప్రదర్శించాడు. అతని ప్రదర్శన చూసిన ఉపాధ్యాయులు, విద్యార్థులు ఆశ్చర్యపోయారు. పాఠశాల ప్రధానోపాధ్యాయుడు సంజీవ్ సోనార్ ఈ వీడియోను సామాజిక మాధ్యమాల్లో పంచుకోగా, కొద్ది గంటల్లోనే అది వైరల్‌గా మారింది. నెలరోజుల్లోనే ఈ వీడియోకు 50 లక్షలకుపైగా వీక్షణలు లభించాయి.