బుద్ధ పూర్ణిమ: భారతదేశంలోని ప్రసిద్ధ బౌద్ధ క్షేత్రాలు ఎక్కడ ఉన్నాయో తెలుసుకోండి
బుద్ధ పూర్ణిమ.. బుద్ధుడు జన్మించిన రోజును బుద్ధ పూర్ణిమగా జరుపుకుంటారు. బౌద్ధ మతానికి మూలకారకుడు గౌతమ్ సిద్ధార్థ. ఆయనే ఆ తర్వాత గౌతమ బుద్ధుడిగా మారాడు. మగధ రాజుల కాలంలో బౌద్ధమతం ప్రపంచ వ్యాప్తంగా వ్యాపించింది. ప్రస్తుతం ప్రపంచంలో దాదాపు 50కోట్ల వరకు బౌద్ధ మతాన్ని ఆచరించే వాళ్ళున్నారు. మే 5వ తేదిన బుద్ధ పూర్ణిమ కాబట్టి భారతదేశంలో ప్రసిద్ధ బౌద్ధ క్షేత్రాల గురించి తెలుసుకుందాం. మహాబోధి దేవాలయం - బుద్ధ గయ: భారతదేశంలోని అత్యంత ప్రసిద్ధ బౌద్ధ క్షేత్రమైన బుద్ధ గయ, బీహార్ లో ఉంది. గౌతమ బుద్ధుడు బోధి వృక్షం కింద జ్ఞానోదయం పొందింది ఇక్కడే.
బంగారు బుద్ధుడి విగ్రహం కలిగిన బౌద్ధక్షేత్రం
మహాపరినిర్వాణ టెంపుల్ - ఖుషినగర్: ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలో ఖుషీ నగర్ లో ఉన్న ఈ టెంపుల్ లో 6మీటర్ల పొడవున్న బుద్ధ విగ్రహం ఉంటుంది. బుద్ధుడి మరణ కాలాన్ని ఈ టెంపుల్ తెలుపుతుంది. 5వ శతాబ్దానికి చెందిన ఈ గుడిలో, పడుకున్న బుద్ధ విగ్రహాన్ని చూడవచ్చు. సాంచీ స్థూపం: మధ్యప్రదేశ్ లోని రాయిసెన్ జిల్లాలో ఉంది. క్రీస్తు పూర్వం 3వ శతాబ్దంలో ఈ స్థూపాన్ని నిర్మించారు. మౌర్య చక్రవరి అశోకుడు ఈ స్థూపాన్ని నిర్మించాడు. ప్రపంచ వారసత్వ సంపదగా ఈ ప్రదేశానికి యునెస్కో నుండి గుర్తింపు లభించింది. తవాంగ్ మోనస్టరీ: ఈ బౌద్ధక్షేత్రంలో బుద్ధుడి బంగారు విగ్రహం ఉంది. అరుణాచల్ ప్రదేశ్ లోని తవాంగ్ ప్రాంతంలో ఉంది.
ఈ టైమ్ లైన్ ని షేర్ చేయండి