LOADING...
Stock Market: నష్టాల్లో ముగిసిన దేశీయ మార్కెట్ సూచీలు.. 460 పాయింట్లు క్షీణించిన సెన్సెక్స్
460 పాయింట్లు క్షీణించిన సెన్సెక్స్

Stock Market: నష్టాల్లో ముగిసిన దేశీయ మార్కెట్ సూచీలు.. 460 పాయింట్లు క్షీణించిన సెన్సెక్స్

వ్రాసిన వారు Sirish Praharaju
Oct 31, 2025
04:13 pm

ఈ వార్తాకథనం ఏంటి

దేశీయ షేర్‌ మార్కెట్లు ఈరోజు నష్టాలతో ముగిశాయి. అమెరికా ఫెడరల్‌ రిజర్వ్‌ వడ్డీ రేట్లపై పెట్టుబడిదారులు జాగ్రత్త ధోరణి అవలంబించడం,విదేశీ పెట్టుబడుల ఉపసంహరణ వంటి పరిణామాలు మార్కెట్‌పై ప్రతికూల ప్రభావం చూపించాయి. ఉదయం లాభాలతో ప్రారంభమైన సూచీలు, తర్వాతి గంటల్లో అమ్మకాల ఒత్తిడికి లోనై క్రమంగా దిగజారాయి. ముఖ్యంగా హెల్త్‌కేర్‌, మెటల్‌, పవర్‌ రంగాలకు సంబంధించిన షేర్లు గణనీయంగా నష్టపోయాయి. చివరికి సెన్సెక్స్‌ 460 పాయింట్లకు సమీపంగా, నిఫ్టీ 150 పాయింట్లకు పైగా తగ్గుతూ ముగిశాయి.

వివరాలు 

 డాలరుతో పోలిస్తే రూపాయి మారకం విలువ 88.77 గా నమోదు 

ఉదయం సెన్సెక్స్‌ 84,379.79 పాయింట్ల వద్ద (మునుపటి ముగింపు 84,404.46 పాయింట్లు) ప్రారంభమైంది. సెషన్‌లో ఒక దశలో 84,712.79 పాయింట్ల గరిష్ఠాన్ని తాకినా, తర్వాత ఒత్తిడికి లోనై చివరికి 465.75 పాయింట్లు తగ్గి 83,938.71 వద్ద స్థిరపడింది. నిఫ్టీ కూడా 155.75 పాయింట్లు కోల్పోయి 25,722.10 వద్ద ముగిసింది. సెన్సెక్స్‌లో భాగమైన కంపెనీల్లో ఎటెర్నల్‌, ఎన్‌టీపీసీ, కొటక్‌ బ్యాంక్‌, బజాజ్‌ ఫైనాన్స్‌, ఐసీఐసీఐ బ్యాంక్‌, పవర్‌గ్రిడ్‌ షేర్లు గణనీయంగా క్షీణించాయి. అయితే బీఈఎల్‌, ఎల్‌అండ్‌టీ, టీసీఎస్‌, ఐటీసీ, ఎస్‌బీఐ షేర్లు మాత్రం లాభాలు నమోదు చేశాయి. మరోవైపు, డాలరుతో పోలిస్తే రూపాయి మారకం విలువ 88.77 వద్ద కొనసాగింది.