
నడుము పక్కన కొవ్వుతో చర్మం వేలాడుతోందా? ఈ ఆసనాలతో తగ్గించేయండి
ఈ వార్తాకథనం ఏంటి
పొట్ట పెరగడం వల్ల నడుము పక్కన భాగంలో కొవ్వు నిల్వలు ఎక్కువవుతాయి. దానివల్ల నడుము పక్క భాగం వేలాడినట్టుగా కనిపిస్తుంటుంది. వెనకాల నుండి చూసినపుడు ఈ చర్మం వేలాడటం స్పష్టంగా కనిపిస్తుంటుంది. ఇంగ్లీషులో వీటిని ముద్దుగా లవ్ హ్యాండిల్స్ అంటారు.
వీటిని తగ్గించడానికి కొన్ని ఆసనాలు పనిచేస్తాయి.
త్రికోణాసనం:
కాళ్ళ మధ్యలో ఎక్కువ స్థలాన్ని వదిలేసి నిటారుగా నిల్చోండి. మీ కుడికాలు బయట వైపు, ఎడమకాలు లోపలి వైపు చూస్తూ ఉండాలి. ఇప్పుడు నెమ్మదిగా పక్కకు వంగి కుడిచేతిని కుడికాలు మీద ఉంచాలి. ఎడమ చేయిని గాల్లో ఉంచాలి. ఇదే రకంగా ఎడమ వైపు కూడా చేయాలి. కుడిచేయిని, ఎడమ చేయిని సమాంతరంగా ఉంచేలా చూడండి.
యోగ
లవ్ హ్యాండిల్స్ ని తగ్గించే యోగాసనాలు
వృక్షాసనం:
ఇది చాలా సులభం. నిటారుగా నిల్చుని కుడికాలుని పైకి లేపి ఎడమ కాలి మోకాలి పైభాగంలో, కుడికాలి పాదాన్ని ఆనించాలి. ఇప్పుడు రెండు చేతులను గాల్లోకి లేపి నమస్కారం చేయాలి. నిమిషం సేపు చేసాక, వేరే కాలుతో ఇదే మాదిరిగా చేయాలి.
తిర్యక తాడాసనం:
ఈజీగా నిల్చుని చేతులను ఆకాశంలోకి లేపి, అరచేతులను ఆకాశంవైపు చూపించేలా రెండు చేతులను కలిపేయాలి. ఇప్పుడు వెనక్కు వంగకుండా, అలాగే ముందుకు వంగకుండా కేవలం పక్కకు వంగండి. మీ చేతులు వంచకూడదని గుర్తుంచుకోండి. కాసేపయ్యాక మరోపక్కకు వంగండి.
ఉక్థాసనం:
నిటారుగా నిల్చుని చేతులను ఆకాశం వైపు చాచి, మోకాళ్ళను కొద్దిగా వంచుతూ గోడకుర్చీ వేసినట్టుగా కూర్చోండి. ఈ ఆసనాలు లవ్ హ్యాండిల్స్ ని పూర్తిగా తగ్గించేస్తాయి.