ఎత్తు నుండి చూస్తే కళ్ళు తిరుగుతున్నాయా? దాన్నుండి బయటపడే యోగాసనాలు
ఈ వార్తాకథనం ఏంటి
అనారోగ్య సమస్యలను దరిచేరనివ్వకుండా చేయడంలో యోగా పాత్ర కీలకంగా ఉంటుంది. దీర్ఘకాలిక రోగాల నుండి కూడా యోగా బయట పడేస్తుంది. ప్రస్తుతం వర్టిగోను దూరం చేసే యోగాసనాల గురించి తెలుసుకుందాం.
ఎత్తైన బిల్డింగులు ఎక్కినపుడు, కొండలు ఎక్కినపుడు కళ్ళు తిరిగి పడిపోయే సమస్యను వర్టిగో అంటారు. అదొకట్టే కాదు ఎత్తుమీద లేకపోయినా ఒక్కోసారి కళ్ళుతిరిగి పడిపోవడం సంభవిస్తుంటుంది. దీన్నుండి బయటపడే యోగాసనాలు నేర్చుకుందాం.
బాలాసనం: మోకాళ్ల మీద కూర్చుని పిరుదులను మడమలకు ఆనించాలి. ఆ తర్వాత నడుము భాగాన్ని ముందుకు వంచి ఛాతి భాగాన్ని తొడలకు ఆనించాలి. ఇప్పుడు చేతులను శరీరం పక్కన చాపుకుంటే సరిపోతుంది. లేదంటే తలకు సమాంతరంగా చాపాలి.
వర్టిగో
వర్టిగోను దూరం చేసే యోగాసనాలు
హలాసనం: వెల్లకిలా పడుకుని కాళ్ళను 90డిగ్రీల కోణంలో పైకి లేపి ఆ తర్వాత 180డిగ్రీల వరకు తల వెనక్కు వంచాలి. చేతులను శరీరం పక్కనే ఉంచుకోవాలి.
పశ్చిమోత్థాసనం: కాళ్ళను ముందుకు చాపి నడుమును వంచి తలను మోకాళ్ళకు ఆనించాలి. ఆ తర్వాత చేతులతో అరికాళ్ళను పట్టుకోవాలి. ఇలా చేసినపుడు మోకాళ్ళను వంచకూడదని గుర్తుంచుకోండీ.
శవాసనం: ఈ అసనాన్ని చాలా సులభంగా చేయవచ్చు. దీనివల్ల అలసట, ఒత్తిడి దూరమవుతాయి. వెల్లకిలా పడుకుని చేతులకు శరీరానికి పక్కన పెట్టుకుని కాళ్ళ మధ్య కొంచెం దూరం ఉండేలా చూసుకోవాలి.
విపరీత కారణి: వెల్లకిలా పడుకుని కాళ్ళను 90డిగ్రీలు పైకి లేపాలి. తర్వాత నడుము భాగాన్ని కూడా పైకి లేపి పడిపోకుండా ఉండేలా పిరుదులను చేతులతో బలం ఇవ్వాలి.