వర్టిగో: మీ చుట్టూ ప్రపంచం తిరుగుతున్నట్టు అనిపిస్తుందా? ఇది చదవండి
ఈ వార్తాకథనం ఏంటి
వర్టిగో అనేది ఒకరకమైన లక్షణం. ఇది వ్యాధి కాదు, వ్యాధి లక్షణం. మీ చుట్టూ ఉన్న ప్రపంచం తిరుగుతున్నట్టు అనిపించడమే వర్టిగో లక్షణం. ప్రస్తుతం వర్టిగో రావడానికి కారణాలు, లక్షణాలు, ట్రీట్ మెంట్ విధానాలు తెలుసుకుందాం.
వర్టిగో రెండు రకాలు. ఫెరిఫరల్ వర్టిగో, సెంట్రల్ వర్టిగో.
ఫెరిఫరల్ వర్టిగో అనేది లోపలి చెవిలో ఏదైనా సమస్య ఉంటే ఉత్పన్నమవుతుంది. బ్రెయిన్ లో సమస్య ఉంటే సెంట్రల్ వర్టిగో పుట్టుకొస్తుంది.
లోపలి చెవి సమస్యలు, తలకు గాయాలు, ఇంకా కొన్ని మందుల ప్రభావం వల్ల వర్టిగో వస్తుంది. లోపలి చెవిలోని వెస్టిబ్యులర్ నరంపై ఒత్తిడి పడడం, ఆ నరం ఉబ్బడం మొదలగు వాటివల్ల వర్టిగో వస్తుంది.
ఆరోగ్యం
వర్టిగో వల్ల కలిగే ఉత్పన్నమయ్యే ఇతర సమస్యలు
కంటిచూపు తగ్గిపోవడం, తలతిరగడం, చెవుల్లో ఏవో శబ్దాలు వినిపించడం అనే ఇతర సమస్యలు వర్టిగో వల్ల ఉత్పన్నం అవుతాయి. కొన్ని కొన్నిసార్లు చెవులు వినిపించక పోవడం కూడా జరుగుతుంటుంది. వికారంగా ఉండడం, శరీరం నిలబడలేక పడిపోతుంటారు.
వర్టిగో వల్ల మీరు ఎలాంటి ఇబ్బందులు పడుతున్నారో దాన్నిబట్టి మీకు ట్రీట్ మెంట్ చేస్తారు. మెడిసిన్స్ వల్ల వర్టిగో లక్షణాలను కొద్దిమేర తగ్గించవచ్చు. లోపలి చెవిలోని వెస్టిబ్యూలర్ నరం వల్ల వర్టిగో సమస్య ఉంటే వెస్టిబ్యూలర్ రిహబిలిటేషన్ చేయాల్సి ఉంటుంది.
అపోహా - తలతిరగడం లాంటిదే వర్టిగో కూడా
వర్టిగో వ్యాధిలక్షణంలో చుట్టూ ఉన్న ప్రపంచం తిరుగుతున్నట్టుగా ఉంటుంది.
అపోహా- ఎత్తులంటే భయపడేవారికి మాత్రమే వర్టిగో వస్తుంది
వర్టిగో అనేది ఎవ్వరికైనా వచ్చే అవకాశం ఉంది.