Corn silk: మొక్కజొన్న పీచు టీ తాగితే అనేక ఆరోగ్య ప్రయోజనాలు పొందుతామని తెలుసా..?
ఈ వార్తాకథనం ఏంటి
మొక్కజొన్నలను ఇష్టపడనివారుండరు. నిప్పుపైన కాల్చిన పొత్తులు లేదా ఉడికించిన మొక్కజొన్నలు అద్భుతమైన రుచి కలిగివుంటాయి.
మొక్కజొన్నలు రుచిలోనే కాకుండా పోషకాలలోకూడా ఆరోగ్యానికి చాలా మంచివని మనకు తెలిసిందే.
అంతేకాకుండా,మొక్కజొన్నలోని పీచు,కూడా మన శరీరానికి బాగా ఉపయోగకరమైనది.
నిపుణులు చెబుతున్న ప్రకారం, మొక్కజొన్న పీచులోని పోషకాలు మన ఆరోగ్యానికి అనేక రకాల ప్రయోజనాలు అందిస్తాయి.
5000 సంవత్సరాల క్రితమే దీనిని అనేక రుగ్మతలకు చికిత్సగా ఉపయోగించారు.
మొక్కజొన్న పీచులో పొటాషియం, కాల్షియం, విటమిన్ బి2, సి, కె వంటి ముఖ్యమైన పోషకాలు ఉన్నాయి.
మొక్కజొన్న పీచుతో చేసిన టీ తాగడం ద్వారా మన ఆరోగ్యం మెరుగుపడుతుంది. దీని ప్రయోజనాలను తెలుసుకోవాలంటే.. ఈ స్టోరీ చదివేయండి.
వివరాలు
కిడ్నీలను డిటాక్స్ చేస్తుంది
మొక్కజొన్న పీచు కిడ్నీలకు దివ్య ఔషధంగా పనిచేస్తుంది. ఇది కిడ్నీలోని విషాలను తొలగించడంలో సహాయపడుతుంది,
అలాగే కిడ్నీ రాళ్లను తొలగించడంలో కూడా ఈ పీచు సహాయపడుతుంది.
మొక్కజొన్న పీచుతో తయారైన టీ తాగడం ద్వారా మూత్రపిండాల్లో నిలిచిన టాక్సిన్స్, నైట్రేట్‌లు తొలగిపోతాయి. ఇది తరచుగా తీసుకుంటే కిడ్నీ రాళ్లను దూరంగా ఉంచవచ్చు.
వివరాలు
యూరిన్ ఇన్ఫెక్షన్ తగ్గిస్తుంది
మొక్కజొన్న పీచులో ఉన్న యాంటీ ఇన్ఫ్లమేటరీ గుణాలు, యూరినరీ ట్రాక్ ఇన్ఫెక్షన్, మూత్రంలో మంట వంటి సమస్యలను తగ్గించడానికి సహాయపడతాయి.
ఇది యూరిన్‌లో ఉండే బ్యాక్టీరియాను కూడా నశింపజేస్తుంది.
అలాగే, ఈ పీచు అదనపు నీటిని, వ్యర్థాలను శరీరమొకటి నుండి బయటకు పంపుతుంది. మొక్కజొన్న పీచు టీ ప్రోస్టేట్ గ్రంధిని ఆరోగ్యంగా ఉంచుతుంది.
వివరాలు
షుగర్‌ను కంట్రోల్ చేస్తుంది
మొక్కజొన్న పీచులో ఉన్న ఫైబర్, విటమిన్లు మరియు మినరల్స్ మన శరీరానికి మంచి పోషణ అందిస్తాయి.
ముఖ్యంగా రక్తంలో చక్కెర స్థాయిలను కంట్రోల్ చేయడంలో ఇది చాలా సమర్థవంతంగా పనిచేస్తుంది.
ఇందులో ఉన్న గుణాలు ఇన్సులిన్ హార్మోన్‌ను నియంత్రించి, షుగర్ స్థాయిలను కంట్రోల్ చేస్తాయి.
షుగర్ ఉన్న వ్యక్తులు మొక్కజొన్న పీచు టీ తాగితే, రక్తంలో చక్కెర స్థాయిలు నియంత్రణలో ఉంటాయి.
కొవ్వు కరిగిస్తుంది
మొక్కజొన్న పీచు జీర్ణక్రియను పెంచుతుంది, జీవక్రియను వేగవంతం చేస్తుంది.
ఇది శరీరంలోని అధిక నీటిని తొలగించి, టాక్సిన్స్‌ను బయటకు పంపిస్తుంది. తద్వారా శరీరంలోని అధిక కొవ్వు కూడా కరిగిపోతుంది.