Loading...
Rakhi Festival: భార్య భర్తకు రాఖీ కట్టవచ్చా? పురాణాల్లో ఏం ఉందో తెలుసా?
భార్య భర్తకు రాఖీ కట్టవచ్చా? పురాణాల్లో ఏం ఉందో తెలుసా?

Rakhi Festival: భార్య భర్తకు రాఖీ కట్టవచ్చా? పురాణాల్లో ఏం ఉందో తెలుసా?

వ్రాసిన వారు Jayachandra Akuri
Aug 25, 2026
03:28 pm

ఈ వార్తాకథనం ఏంటి

రాఖీ పండుగకు ఎంతో ప్రాముఖ్యత ఉంది. అన్నదమ్ములు, అక్కాచెల్లెళ్లు ఎంతో ఘనంగా జరుపుకునే పండుగ ఇది. రాఖీ పండుగ రోజు (ఆగస్టు 28) సోదరీమణులు తమ సోదరులకు రాఖీ కడతారు. అయితే రాఖీని ఇంకా ఎలాంటి బంధాలు కలిగిన వారు కట్టుకోవచ్చు? భార్య తన భర్తకు రాఖీ కట్టవచ్చా? పురాణాల్లో ఇందుకు సంబంధించిన ప్రస్తావనలు ఉన్నాయా? దేవతల్లో ఎవరెవరు రాఖీ కట్టుకున్నారు? వంటి ఆసక్తికర విషయాలను ఈ స్టోరీలో తెలుసుకుందాం.

వివరాలు

భార్య.. భర్తకు రాఖీ కట్టవచ్చా?

రాఖీ అంటే రక్షగా ఉంటామని ఇచ్చే వాగ్దానం. ఎలాంటి పరిస్థితులు ఎదురైనా రాఖీ కట్టిన వారికి అండగా నిలబడి, వారిని ఎల్లవేళలా రక్షించాలనే భావన ఇందులో ఉంటుంది.

భార్య తన భర్తకు రాఖీ (రక్షాబంధనం) కట్టే సంప్రదాయం పురాణాల్లోనూ ఉన్నట్లు తెలుస్తోంది.

వివరాలు

ఇంద్రుడికి రాఖీ కట్టిన భార్య ఇంద్రాణి

వేదకాలంలో రాక్షసులు, దేవతల మధ్య భీకర యుద్ధం జరిగింది. ఈ యుద్ధం శ్రావణమాసంలో పౌర్ణమి రోజున జరిగినట్లు పురాణాలు చెబుతున్నాయి.

రాక్షసుల చేతిలో దేవతలు ఓడిపోయే పరిస్థితికి వచ్చారు. దీంతో ఇంద్రుడు ఆందోళనకు గురయ్యాడు. రాక్షసులు యుద్ధంలో గెలిస్తే ఎదురయ్యే పరిణామాల గురించి ఆలోచిస్తూ భయపడిన ఇంద్రుడు తన గురువు బృహస్పతిని సలహా అడిగాడు.

అప్పుడు ఇంద్రుడి భార్య ఇంద్రాణితో అతని మణికట్టుకు రక్షా సూత్రం కట్టించాలని బృహస్పతి సూచించాడు.

ఆయన సలహా మేరకు ఇంద్రాణి శ్రావణ పౌర్ణమి రోజున ఇంద్రుడి మణికట్టుకు రాఖీ కట్టింది. ఆమె రక్షగా కట్టిన ఆ దారం ఎంతో శక్తివంతంగా పనిచేసిందని, యుద్ధంలో దేవతల విజయానికి అది దోహదపడిందని చెబుతారు.

ADVERTISEMENT

వివరాలు

భర్త దేవేంద్రుడికి రక్షాబంధన్ కట్టిన శచీదేవి

స్వర్గలోకాధిపతి దేవేంద్రుడి రాజ్యమైన అమరావతిని బలిచక్రవర్తి సొంతం చేసుకున్నాడు.

తన రాజ్యాన్ని తిరిగి సాధించేందుకు ఇంద్రుడు బలిచక్రవర్తిపై యుద్ధానికి బయలుదేరాడు. ఆ సమయంలో తన భర్తకు విజయం కలగాలని కోరుకుంటూ ఇంద్రుడి భార్య శచీదేవి విష్ణుమూర్తిని వేడుకుంది.

అప్పుడు విష్ణుమూర్తి ఆమెకు ఒక రక్షను అందించాడు. శచీదేవి ఆ రక్షను తన భర్త ఇంద్రుడికి కట్టి యుద్ధానికి సాగనంపింది. ఆ యుద్ధంలో ఇంద్రుడు విజయం సాధించాడు.

రక్షాబంధన్ అనేది కేవలం సోదరసోదరీమణుల మధ్య ఉండే బంధం మాత్రమే కాదని ఈ కథనాల ద్వారా తెలుస్తోంది. యుద్ధానికి వెళ్లే భర్తలకు భార్యలు వీరతిలకం దిద్ది, రక్షను కట్టి పంపించే ఆనవాయితీ కూడా ఉండేదని చెబుతారు. ఇదే క్రమంగా రక్షాబంధనంగా మారిందని అంటారు.

ADVERTISEMENT

వివరాలు

విజయం కోసం భార్యలు భర్తలకు కట్టే రక్షాబంధన్

రక్షాబంధన్ అనేది కేవలం బంధాలకు మాత్రమే కాదు.. రక్షకు కూడా గుర్తు అని చెప్పవచ్చు. భర్తకు భార్య కట్టినా.. సోదరులకు సోదరీమణులు కట్టినా.. రక్షాబంధన్ అనేది రక్షకు ప్రతీకగా నిలుస్తోంది.

రక్షాబంధన్ వేడుకలు వేదయుగంలో ప్రారంభమైనప్పటికీ, కలియుగంలోనూ ఈసంప్రదాయాన్ని ప్రజలు కొనసాగిస్తున్నారు.

రాఖీ పండుగ ఇప్పటికీ బంధాలను మరింత బలోపేతం చేస్తూనే ఉంది. పురుషుడు లేదా స్త్రీ అనే తేడా లేకుండా ప్రతి రక్షకుడు రాఖీకి అర్హుడనే భావన ఇందులో కనిపిస్తుంది.

మొదటి రాఖీని ఎవరు కట్టారు అనేది ఎవరికీ తెలియని రహస్యం కావచ్చు.

కానీ రక్షాబంధన్ మాత్రం ఓ సంతోష సంబరం. పండుగ ఏదైనా పదిమంది కుటుంబ సభ్యులు ఒకచోట చేరితే ఆ ఇల్లు ఆనందాల హరివిల్లులా మారుతుందనడంలో సందేహం లేదు.

ADVERTISEMENT