Orange: హార్వర్డ్ మెడికల్ స్కూల్ శాస్త్రవేత్తల అధ్యయనం.. నారింజ తింటే మెదడు సామర్థ్యాలు కూడా మెరుగయ్యే అవకాశాలు..
ఈ వార్తాకథనం ఏంటి
నారింజకు ఉన్న విసిష్టమైన సువాసన,రుచిని గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు.
నారింజ వల్ల కలిగే లాభాల గురించి చాలా మందికి ముందుగా తెలిసిన సంగతే.
అయితే, నారింజను తినడం వల్ల మూడ్ మెరుగుపడటమే కాకుండా,జ్ఞాపకశక్తి కూడా పెరిగే అవకాశముందని హార్వర్డ్ మెడికల్ స్కూల్ శాస్త్రవేత్తలు తాజా పరిశోధనల్లో గుర్తించారు.
నిమ్మజాతికి చెందిన ఈ పండును తినడం ద్వారా డిప్రెషన్ ముప్పు తగ్గించుకోవచ్చని శాస్త్రవేత్తలు వెల్లడించారు.
ఈ ప్రయోజనం ఆరటి,యాపిల్ వంటి ఇతర పండ్లలో కనబడలేదని పేర్కొన్నారు.
నారింజలో ఉండే విటమిన్ సీ న్యూరాన్ల ఎదుగుదలకు సహాయపడుతుంది.
ఇవి ఆరోగ్యంగా ఉండేందుకు ఒక రక్షణ కవచాన్ని ఏర్పరచడంతో పాటు,మెదడు సమాచారం మార్పిడి శక్తిని వేగవంతం చేస్తుంది.
అంతేగాక,నారింజలోని పోషకాలు మెదడులో ముఖ్యమైన రసాయనాల ఉత్పత్తిని ప్రేరేపిస్తాయి.
వివరాలు
డిప్రెషన్ చికిత్సలలో నారింజ ఉపయుక్తం
ఇంకా,నారింజలోని ఫ్లేవనాయిడ్స్ అనే సంయోగాలు పేగుల్లో ఆరోగ్యకరమైన బ్యాక్టీరియా పెరిగేలా చేస్తాయి.
దీని ప్రభావంతో మానసిక ఉల్లాసాన్ని పెంచే సెరటోనిన్, డోపమైన్ వంటి న్యూరోట్రాన్స్‌మిటర్లు అధికంగా విడుదల అవుతాయి.
అదనంగా, నేర్చుకోవడం, జ్ఞాపకం ఉంచుకోవడం వంటి మానసిక శక్తులను మెరుగుపరిచే హిప్పోకాంపస్ అనే మెదడు భాగాన్ని నారింజలోని పోషకాలు సక్రియం చేస్తాయని పరిశోధకులు గుర్తించారు.
అయితే, నిమ్మజాతి పండ్లు మెదడు పనితీరును మెరుగుపరచగలవనే విషయాన్ని నిర్ధారించడానికి మరింత సగటు పరిశోధనలు అవసరమని శాస్త్రవేత్తలు స్పష్టం చేశారు.
ఇంకా, డిప్రెషన్ చికిత్సలు సంపూర్ణ స్థాయిలో అందుబాటులో లేనందున, నారింజ ఉపయుక్తంగా మారవచ్చని వారు అభిప్రాయపడ్డారు.
అలాగే, మానసిక ఆరోగ్యానికి పేగుల ఆరోగ్యంతో ప్రత్యక్ష సంబంధం ఉందన్న అంశాన్ని తమ పరిశోధనల్లో గుర్తించామని శాస్త్రవేత్తలు తెలిపారు.