
Cardamom Face Pack: యాలకుల ఫేస్ ప్యాక్ తో మీ చర్మం ప్రకాశవంతంగా మారుతుంది.. ఎలా చేయొచ్చో చూడండి
ఈ వార్తాకథనం ఏంటి
పచ్చగా, చిన్నగా మొగ్గల్లాగా ఉండే యాలకులకు భారతీయ వంటకాల్లో ప్రత్యేకమైన ప్రాధాన్యత ఉంది.
వాటి ప్రత్యేక వాసన, ఆరోగ్య ప్రయోజనాలు మసాలా టీ నుంచి బిర్యానీ వరకు వివిధ వంటకాలలో ఉపయోగించబడతాయి.
వంటకాలలో మాత్రమే కాకుండా, యాంటీ ఆక్సిడెంట్ లక్షణాల వల్ల చర్మసౌందర్యానికి కూడా ఇవి సహాయపడతాయి.
యాలకులను మీ స్కిన్ కేర్ రొటీన్‌లో చేర్చడం ద్వారా మెరిసే చర్మం పొందవచ్చు. అందుకోసం యాలకులను ఎలా ఉపయోగించాలో చూడండి.
వివరాలు
యాలకులను చర్మానికి ఎలా ఉపయోగించాలి?
యాలకులను వివిధ విధాలుగా ఉపయోగించవచ్చు, వీటిలో స్క్రబ్ నుంచి మాస్క్ వరకు ఉన్నాయి. వాటిని ఎలా ఉపయోగించాలో చూద్దాం.
యాలకులతో ఫేస్ స్క్రబ్:
చర్మంపై ఉన్న మృత కణాలను తొలగించి చర్మాన్ని ప్రకాశవంతంగా మార్చేందుకు స్క్రబ్ చేయడం అవసరం.
ఈ సారి యాలకులను ఉపయోగించి స్క్రబ్ తయారుచేయండి.
ఈ క్రింద ఇచ్చిన పదార్థాలు అవసరం: ఒక టీస్పూన్ యాలకుల పొడి, ఒక చెంచా తేనె, ఒక చెంచా పంచదార. వీటిని బాగా కలిపి, ముఖం ,మెడలో వలయాకారంలో రుద్దాలి. వారానికి ఒకసారి చేస్తే చాలు, ఫలితం త్వరగా కనిపిస్తుంది.
వివరాలు
యాలకులతో లిప్ స్క్రబ్
ఒక చెంచా యాలకుల పొడి,ఒక చెంచా పంచదార,ఒక చెంచా తేనెను బాగా కలపాలి.
ఈ మిశ్రమాన్ని పెదాలకు రాసి మర్దనా చేస్తే,పెదాలపై ఉన్న మృత కణాలను తొలగించి వాటిని ఆరోగ్యంగా మార్చుతుంది. పది నిమిషాల తర్వాత కడిగి,లిప్ బామ్ రాయండి.
యాలకులతో ఫేస్ ప్యాక్
ముఖానికి తాజాదనం తీసుకొచ్చే ప్యాక్‌గా ఇది ఉపయోగపడుతుంది.యాలకుల పొడి,పసుపు, నిమ్మరసం తీసుకుని బాగా కలుపుకోండి.ఈ మిశ్రమాన్నిముఖానికి రాసి,పావుగంట తర్వాత చల్లటి నీటితో కడగాలి.చర్మంలో మార్పు స్పష్టంగా కనిపిస్తుంది.
ఫేస్ టోనర్
ఒక చెంచా యాలకుల పొడిని ఒక కప్పు రోజ్ వాటర్‌లో కలపండి.కనీసం అరగంట నుంచి ఒక గంట వరకు వదిలేయండి.
ఆపై ఈమిశ్రమాన్నిబాగా వడకట్టండి.దీన్ని టోనర్‌గా ఉపయోగించవచ్చు.ఫ్రిజ్‌లో ఉంచి అవసరమైతే దూది ముంచి ముఖానికి రాయండి.
వివరాలు
సైడ్ ఎఫెక్ట్స్
సాధారణంగా యాలకులతో సైడ్ ఎఫెక్ట్స్ ఉండవు. కానీ సున్నిత చర్మం ఉన్నవాళ్లు ముందు పరీక్షించుకోవడం మంచిది.
చేతి మీద ప్యాచ్ టెస్ట్ చేసుకుని వాడాలి. దురద, మంట, దద్దుర్లు, చర్మం ఎరుపెక్కడం వంటి లక్షణాలు ఉంటే వెంటనే కడగాలి.
అలాగే, ఎక్కువ మోతాదులో యాలకులను వాడితే చర్మం పొడిగా మారవచ్చు. కాబట్టి అవసరానికి తగినంత వాడాలి.