యూరప్ డే: యూరప్ ఖండంలో ఖచ్చితంగా చూడాల్సిన అతి సుందర ప్రదేశాలు
ఈ వార్తాకథనం ఏంటి
యూరప్ లోని పర్యాటక ప్రదేశాలను సందర్శించాలన్న ఉద్దేశ్యంతో మే 9వ తేదీన యూరప్ డే ను జరుపుకుంటారు. యూరప్ ఖండంలో చూడదగ్గ ప్రదేశాలు ఎన్నో ఉన్నాయి.
అజోర్స్ - పోర్చుగల్:
పోర్చుగల్ లోని అజోర్స్ ప్రాంతం, అనేక ద్వీపాల సమూహం. చుట్టూ జలపాతాలు, అందమైన ఆకాశం, చూడడానికి మనోహరంగా ఉంటుంది.
ఈ ప్రదేశంలో తిమింగలం, డాల్ఫిన్ వంటి సముద్ర జీవులను చూడవచ్చు.
లోఫోటెన్ ఐలాండ్ - నార్వే:
చుట్టూ ఎత్తయిన పర్వతాలు, శిఖరాలు ఉండే ఈ ద్వీపంలో, సముద్ర తీరాలు అత్యద్భుతంగా కనిపిస్తాయి. అంతేకాదు, ఈ ద్వీపంలో అటవీ ప్రాంతం ఎక్కువగా ఉంటుంది. కాబట్టి వన్యమృగాలను వీక్షించవచ్చు.
Details
గులాబీ రంగులో నీరుండే సరస్సులు కలిగి ఉన్న ప్రాంతం
మోరావియన్ పచ్చిక బయళ్ళు - చెక్ రిపబ్లిక్:
ఈ ప్రదేశాన్ని మీరు గూగుల్ చేస్తే వాల్ పేపర్ పెట్టుకునేంత అందంగా ఉన్న పచ్చిక బయళ్ళు కనిపిస్తాయి. ఫోటోగ్రాఫర్లకు ఈ ప్రాంతం అనువుగా ఉంటుంది.
మీరు పచ్చదనాన్ని ఇష్టపడితే ఈ ప్రాంతాన్ని సందర్శించడం మర్చిపోవద్దు. మిమ్మల్ని అ! అనిపించి ఆశ్చరపోయేలా చేస్తుంది.
ఆల్ఫ్స్ పర్వతాలు -స్విట్జర్ ల్యాండ్:
యూరప్ అందాలను చూడాలనుకున్న వారు స్విట్జర్ ల్యాండ్ తప్పకుండా వెళ్ళాలి. ట్రెక్కింగ్ చేసేవళ్ళని స్కయింగ్ చేసేవాళ్ళను ఆల్ఫ్స్ పర్వతాలు ఎంతగానో ఆకర్షిస్తాయి.
లాస్ సాలినాస్ డి టోరేవేజా - స్పెయిన్:
గులాబీ రంగులో నీరుండే సరస్సలు ఈ ప్రాంతంలో ప్రధాన ఆకర్షణ. ఈ నీటిలో ఈత కొట్టవచ్చు